పవన్ కళ్యాన్ లేటెస్ట్ లుక్ అదిరిందిగా… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ…
1 min read
Pawan Kalyan Latest Photo. Image: Instagram @ pawankalyan.k
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ త్రివిక్రమ్ తో చేసిన అజ్ఞాత వాసి తరువాత రాజకీయాలకు దగ్గరవడంతో తన గ్లామర్ పై అంత శ్రద్ద పెట్టలేదనే చెప్పొచ్చు. గడ్డం, పెద్ద జుట్టుతో కనిపించేవాడు. వరుసబెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మునుపటిలా తన గ్లామర్ పై దృష్టి పెట్టాడు.
ఫ్యాన్స్ పవర్ స్టార్ ని స్క్రీన్ మీద చూసి దాదాపు 3 సంవత్సరాలు కావస్తోంది. పోయిన సంవత్సరం విడుదల కావాల్సిన వకీల్ సాబ్ కరోనా కారణంగా విడుదలకు బ్రేక్ పడింది. వకీల్ సాబ్ సినిమా వచ్చే నెల ఏప్రియల్ 19 కి విడుదలకు సిద్ధమైంది. అయితే పవర్ స్టార్ వరుస బెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం తో పాటు తన గ్లామర్ పై కూడా ద్రుష్టి పెట్టాడని instagram లో విడుదల చేసిన లేటెస్ట్ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. క్లీన్ షేవ్ తో బ్లాక్ ట్రౌజర్, టీ షర్ట్ లో నడుముపై చేతులు పెట్టుకొని చిరునవ్వుతో హ్యండ్సమ్ లుక్ తో ఆదరగొడుతున్నాడు. ఈ ఫోటో చూసి అభిమానులు పవర్ స్టార్ ఈస్ బ్యాక్ అంటూ సంబర పడుతూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాన్ డైరెక్టర్లు క్రిష్, హరీష్ శంకర్, సాగర్ చంద్ర సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
