May 12, 2025

Digital Mixture

Information Portal

భారత క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతం జరిగి 10 సంవత్సరాలు…

1 min read
2011 World Cup Final

2011 World Cup Final

భారత క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతం జరిగి ఈ రోజుకి సరిగ్గా పదేళ్ళు. అదేనండీ 10సంవత్సరాల క్రితం భారత క్రికెట్ జట్టు రెండవ సారి ప్రపంచ కప్ గెలిచిన రోజు ఈ రోజు. పది సంవత్సరాల క్రితం ఇదే రోజు దేశం లోని క్రికెట్ అభిమానులంతా టీవిలకు అతుక్కోనిపోయిన రోజు.  2011  ఏప్రిల్ 2 వ తేదీన భారత్  శ్రీలంక మద్య ముంబై వాఖడే  స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాదించిన రోజు.

28 సంవత్సరాల తరువాత మనం ఈ ప్రపంచకప్ గెలవడం జరిగింది. ఇప్పటీకీ మనం ఈ మ్యాచ్ ని యూట్యూబ్ లో ఎన్నో సార్లు చూసి ఉంటాం. ఎన్ని సార్లు చూసిన మనకు తనివి తీరదు. మనకు బాగా గుర్తుండేది మహేంద్ర సింగ్ దోనీ సిక్స్ తో మ్యాచ్  ఫినిష్ చేయడం, దానికి ప్రస్తుత టీం ఇండియా  కోచ్ రవి శాస్త్రీ కామెంటరీ. మహేంద్ర సింగ్ సిక్స్ కొట్టగానే  “ధోనీ ఫినిషెస్  ఆఫ్ ఇన్ స్టైల్ ఎ మాగ్నిఫిసెంట్    స్ట్రైక్ ఇన్ టు ది క్రౌడ్ ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్” …. ఇది భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో పదిలంగా ఉందని చెప్పొచ్చు.

ఇదే రోజు టీం ఇండియా గెలుపుతో ముంబై వాంఖడే స్టేడియం హర్ష ద్వానాలతో దద్దరిల్లిందని చెప్పొచ్చు. యావత్ భారత దేశం సంబరాలు జరుపుకుంది. ఇండియాలో  క్రికెట్ ను ఎంత  ఇష్టపడతారో ఆరోజు జరుపుకున్న సంబరాలను బట్టి అర్ధమవుతుంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. చేదనకు దిగిన భారత్  మొదట్లో పరుగులేమీ చేయకుండానే వీరేంద్ర సెహ్వాగ్ వికెట్ కోల్పోయింది. కొద్ది సేపటికే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెవీలియన్ బాట పట్టడంతో టీం ఇండియా కషాల్లో పడింది. తరువాత వచ్చిన గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ లు మంచి భాగస్వామ్యం తో స్కోరును ముందుకు తీసుకెళ్ళారు.  గంబీర్ 97 పరుగులతో, ధోనీ 91 పరుగులు చేసి భారత్ కి 28 సంవత్సరాల తరువాత రెండవ సారి వరల్డ్ కప్ ని సాధించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *