“బాహుబలి”, “ఆర్ఆర్ఆర్” రచయిత, విజయేంద్ర ప్రసాద్ కు కరోనా పాజిటివ్…
1 min read
Vijayendra Prasad Tests Corona Positive
బాహుబలి, ఆర్ఆర్ఆర్ రచయిత మరియు దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. విద్యుల సలహా మేరకు ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. ఆయనను కలిసిన వారంతా ఐసోలేషన్ కి వెళ్లాలని, ఏమైనా కరోనా లక్షణాలు అనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన సూచించారు.
తాజాగా ఈయన చెన్నైలో జరిగిన “తలైవి” సినిమా టైలర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దాని తరువాత కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని తేలిందని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
అయితే తాజాగా “ఆర్ఆర్ఆర్” టీం నటులు కూడా కరోనా బారిన పడటం జరిగింది. అలియా భట్, అజయ్ దేవగన్ కరోనా బారిన పడటం జరిగింది. వీరు వైద్యుల సలహా మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. దీనితో “ఆర్ఆర్ఆర్” టీం కి తలనొప్పిగా మారింది. ఇలా ఆర్టిస్టులు కరోనా బారిన పడటం వలన సినిమా షూటింగ్ కి అంతరాయం కలుగుతోంది. ఈ సినిమాని అక్టోబర్ 13 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ రకంగా షూటింగ్ వాయిదా పడితే, సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
