May 12, 2025

Digital Mixture

Information Portal

రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా కేసులు…జిల్లాల వారీగా కేసులు…

1 min read
రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా కేసులు
రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వెయ్యి దాటింది. రెండవ దశ వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. కొత్తగా 1078 కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. యాక్టివ్ కేసులు 6900 కు చేరుకున్నాయి. 3116 మంది గృహ , ఇతర సంస్థలలో ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,10,819 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 3,02,207 మంది కోలుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం నాటి హెల్త్ బులిటెన్ ని శనివారం విడుదల చేసింది . గడిచిన 24 గంటల్లో 59,705 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2129 రిపోర్టులు రావాల్సి ఉన్నది. 1078 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 331 మంది కోలుకున్నారు.

జిహెచ్ఎంసిలో 283 , మేడ్చల్ మల్కాజిగిరిలో 113 , రంగారెడ్డిలో 104 , నిజామాబాద్లో 75 , సంగారె డ్డిలో 46, నిర్మలో 40 పాజిటివ్ ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా ములుగులో ఒకటి, కొమరంభీమ్ ఆసిఫాబాద్ లో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 3,10,819 పాజిటివ్ కేసులు ఉండగా, 3,02,207 మంది కోలుకున్నారు. మొత్తం 1712 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకున్న వారు రాష్ట్ర స్థాయిలో 97.22 శాతం ఉండగా, జాతీయ స్థాయిలో 93.3 శాతం ఉన్నారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు :

ఆదిలాబాద్ జిల్లాలో 25 , భద్రాద్రి కొత్తగుడెంలో 67 , జిహెచ్ఎంసిలో 283 , జగిత్యాలలో 40 , జనగామలో 8 , జయశంకర్ భూపాలపల్లిలో 12 , జోగులాంబ గద్వాలలో 8 , కామారెడ్డి లో 23 , కరీంనగర్ లో 34 , ఖమ్మంలో 20 , కొమరంభీమ్ ఆసిఫాబాద్ లో 2 , మహబూబ్ నగర్ లో 24 , మహబూబాబాద్ 6 , మంచిర్యాలలో 21 , మెదక్ 12 , మేడ్చల్ మల్కాజిగిరిలో 113 , ములుగులో 1 , నాగర్ కర్నూల్ లో 12 , నల్లగొండలో 33 , నారాయణపేటలో 7 , నిర్మల్ లో 40 , నిజామాబాద్ లో 75 , పెద్దపల్లిలో 11 , రాజన్న సిరిసిల్లలో 15 , రంగారెడ్డిలో 104 , సంగారెడ్డిలో 46 , సిద్దిపేటలో 14 , సూర్యాపేటలో 13 , వికారాబాద్ లో 10 , వనపర్తిలో 10 , వరంగల్ రూరల్ లో 8 , వరంగల్ అర్బన్లో 27 , యాదాద్రి భువనగిరి జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *