#HBD AA: “తగ్గేది లే”దంటున్న “పుష్ప”రాజ్… ఊర మాస్ లుక్ లో కిర్రాక్ పుట్టిస్తున్న స్టైలిష్ స్టార్…
1 min read
#HBD AA
సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. దానికి తోడు బన్ని లుక్, మొదటి సారి బన్ని డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎర్ర చందనం నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు.
అయితే, మైత్రీ మూవీ మేకర్స్ వారు ముందుగా ప్రకటించినట్టు బన్ని పుట్టిన రోజు (ఏప్రిల్ 8) సందర్భంగా పుష్పరాజ్ ని పరిచయం చేసారు. ఇందుకు సంబందించిన వీడియోని (టీజర్) నిన్న విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ మొత్తంలో బన్ని ఒకే ఒక డైలాగ్ చెప్పడం జరిగింది, అదే “తగ్గేది లే” ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడని చెప్పొచ్చు.

దీనికి దేవీశ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పొచ్చు. అలాగే హీరోయిన్ రష్మిక మందన్న ఈ టీజర్ లో పల్లెటూరి అమ్మాయి లుక్ లో కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టీజర్లో ఎర్ర చందనం స్మగ్లర్లకు…పోలీసులకు నడుమ జరిగే యాక్షన్ సన్నివేశాలను చూపించడం జరిగింది. దట్టమైన అడవిలో జరిగే యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు.
ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలుగు తో పాటు, హిందీ, తమిళ్, మలియాళీ మరియు కన్నడ భాషలలో ఆగస్ట్ 13 వ తేదీన విడుదల కానుంది.
