Cricket News: చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా… రెండవ టీ20 లోనూ బంగ్లా సంచలన విజయం…
1 min read
Bangladesh Repeats
ఆతిధ్య జట్టు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా కి మరోసారి భారీ షాక్ ఇచ్చింది. తొలి టీ20 ఓటమి నుంచి కోలుకోకముందే.. ఆస్ట్రేలియా ని రెండో టీ20లో ఓడించి బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. నిన్న బుధవారం ఢాకా వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాని 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్.. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో ఏడు వికెట్ల కోల్పోయి 121 పరుగుల తక్కువ స్కోరును నమోదు చేసింది. ఆసీస్ ఓపెనర్లు జోష్ ఫిలిప్ (10), అలెక్స్ క్యారీ (11) ఘోరంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ (45), మొయిసెస్ హెన్రిక్స్ (30) సమయానికి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా పరుగులు చేయకపోవడంతో ఆసీస్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది.. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్ 2, షకీబ్ ఉల్ హాసన్, మెహదీ హసన్ చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లా 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ని ఛేదించింది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్ (9), సౌమ్యా సర్కార్‌లు (0)లు త్వరగా ఔటైనా.. షకీబ్ ఉల్ హాసన్ 26, మెహదీ హసన్ 23 పరుగులు చేయడంతో మ్యాచ్ చేజారకుండా చూసారని చెప్పొచ్చు. వీరిద్దరి అనంతరం బంగ్లాదేశ్ తడబడింది. మహ్మదుల్లా పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఆసీస్ వైపు వెళ్ళింది.. కీలక సమయంలో బ్యాట్ కు పని చెప్పిన అఫిఫ్ హుస్సేన్ (37, 31 బంతుల్లో 5×4, 1x 6), వికెట్ కీపర్ నూరుల్ హసన్ (22 నాటౌట్) ఆసీస్ కి విజయావకాశం లేకుండా చేసారు. ఈ ఇద్దరు చివరి వరకు నాటౌట్‌గా ఉండటంతో విజయం బంగ్లాని వరించింది.
కీలక సమయంలో బ్యాట్ కు పని చెప్పిన అఫిఫ్ హుస్సేన్ (37, 31 బంతుల్లో 5×4, 1x 6)కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది. మూడో టీ20 శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే.. బంగ్లా హ్యాట్రిక్ కొట్టినట్లవుతుంది. అలాగే సిరీస్ బంగ్లా ఖాతాలో చేరుతుంది.
