Cricket News BAN vs AUS : బంగ్లాదేశ్ సంచలనం…
1 min read
Bangladesh defeats Australia for first time in T20 international
ఆస్ట్రేలియా పై ఘన విజయం…
టి20 లో ఇదే తొలిసారి…
బంగ్లాదేశ్ వేదికగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.
షకీబ్ 36, నయీమ్ 30 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలింగ్ లో హాజల్ వుడ్ 3, స్టార్క్ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్ 45 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా, మిగతా వాళ్ళు వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టడంతో ఆస్ట్రేలియా 23 పరుగులతో ఓటమి చవిచూసింది.
బంగ్లాదేశ్ బౌలర్లు ససుమ్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా, ఇస్లామ్, ముస్తాఫిజుర్ రహ్మాన్ చెరో రెండు వికెట్లు తీసి బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు.
