May 12, 2025

Digital Mixture

Information Portal

#PSPKRana #Bheemlanayak:భీమ్లా నాయక్ వచ్చిండు…క్యాప్షన్ లేకుండానే…

1 min read
Bheemla Nayak Pawan Kalyan First Look

Bheemla Nayak Pawan Kalyan111

గత రెండు రోజులుగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ లేటెస్ట్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ఈ రోజు విడుదల అయ్యింది. లుంగీ లో మాస్ లుక్ లో అదిరి పోయాడని చెప్పొచ్చు. భీమ్లా అనే బ్యాక్ గ్రౌండ్ తో స్టార్ట్ అయ్యే గ్లిమ్స్ పవన కళ్యాన్ లుంగీ తో దర్శనమిస్తాడు. “అరేయ్ డానీ బయటికి రారా నా కొడకా” అంటూ విలన్ దగ్గరికి వచ్చే డైలాగ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుందని చెప్పొచ్చు. లుంగీ లో పొలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ గా పవర్ స్టార్ ఆకట్టుకున్నాడు. చివరగా డానియల్… డానియల్  శేఖర్ అనగానే భీమ్లా… భీమ్లా నాయక్ అనే డైలాగ్ వస్తుంది. తరువాత “ఏంటి చూస్తున్నావ్  క్యాప్షన్ లేదనా అక్కర్లేదు బండెక్కు” అనే పవన్ కళ్యాణ్ డైలాగ్ అందరిని ఆకట్టుకునేలా ఉంది. చివరగా వచ్చే డానియల్… డానియల్  శేఖర్ అనే డైలాగ్ రానా చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే నిన్నటి నుండి వస్తున్నవార్తలు నిజమయ్యాయి. భీమ్లా నాయక్ అనే టైటిల్ ఖరారు చేసారు. అయితే ఇందులో మరో హీరో రానా కూడా ఉండటంతో టైటిల్ ఏదైనా మార్పు ఉండవచ్చేమో అని అందరూ ఉహించారు. కానీ భీమ్లా నాయక్ నే ఫైనల్ చేసారు. అయితే అప్పుడే సోషల్ మీడియాలో ఈ టీజర్  పై నెగటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. ఫస్ట్ గ్లిమ్స్ లో రానా లేకపోవడంతో రానా ఫ్యాన్స్ కొంత నిరాశ చెందినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పరిచయం మాత్రమే ఉండడం కొందరికి రుచించడం లేదు.

Pawar Star Bheemla Nayak

అయితే టైటిల్ విషయం లో కూడా ఇద్దరు హీరోలకు తగ్గట్టుగా ఉండుంటే బాగుండేదని కొందరి అభిప్రాయం. ఎందుకంటే రానా కూడా బాహుబలి సీరిస్ ద్వారా చాలా పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే దీనికి నిర్మాతలు సమాధానం ఇవ్వడం జరిగింది. అప్పుడే అందరూ ఒక నిర్ణయానికి రాకండి. రావ్వాల్సిన సమయానికి అన్నీ వస్తాయి అని తెలిపారు. బహుశా తరువాత విడుదలయ్యే టీజర్ లో రానా ని పరిచయం చేయబోతున్నారేమో.

ఈ సినిమాకి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పవన్ సరసన నిత్యా మీనన్, రానా కి జంటగా ఐశ్వర్య రాజేష్  నటిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ తో పాటు మాటల సాయం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా మ్యూజిక్ ఆల్బం ని  పవన్ కళ్యాన్ పుట్టిన రోజున విడుదల చేయనున్నారు.  అలాగే భీమ్లా నాయక్ సంక్రాంతి సందర్భంగా 12 జనవరి 2022 న విడుదల కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *