May 12, 2025

Digital Mixture

Information Portal

అదృష్టం అంటే ఇదేనండి… “బుల్లెట్టు బండి” వధువుకు బంపర్ ఆఫర్…

1 min read
Bullettu Bandi Groom

Bullettu Bandi

“బుల్లెట్టు బండి” పాట వినని వాళ్ళు ఉండరేమో, ఎందుకంటే ఈ పాట వింటే వచ్చే కిక్కే వేరు అనేలా ఉంటుంది. ఈ పాట విన్న వాళ్ళ స్పందన ఇదీ. ఈ బుల్లెట్ బండి పాట పూర్తి తెలంగాణ యాస తో అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఈ పాట వింటుంటే మన కాలు కదపకుండా ఉండలేం.

ఈ పాట మరింత ఎక్కువ మందికి చేరువ అవ్వడానికి ఈ వధువు చేసిన డ్యాన్స్ అని చెప్పొచ్చు. వధువు అప్పగింతల సమయంలో తన భర్త కోసం ఒక సర్ప్రైస్ ప్లాన్ చేసింది. బుల్లెట్టు బండి పాట కి డ్యాన్స్ చేసి ఆమె భర్తని సర్ప్రైస్ చేసింది. ఈ డ్యాన్స్ ఒక్కసారి సోషల్ మీడియాని షేక్ చేసింది. మొత్తం పాటకి అనుగుణంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒక్క సారిగా ఈమె డ్యాన్స్ వీడియో వైరల్ అయ్యింది. ప్రముఖ న్యూస్ చానల్స్  ఈ దంపతులను ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. దీనితో ఈ వధువు రాత్రికి రాత్రే సెలెబ్రిటీ అయిందని చెప్పొచ్చు. పెళ్ళైన జంట వేముల వాడ రాజన్న దర్శనానికి వెళితే అక్కడ అందరూ ఆ వధువుని గుర్తుపట్టి సేల్ఫీ లు తీసుకున్నారు.

ఈ బుల్లెట్టు బండి పాటకి డ్యాన్స్ చేసిన వధువు పేరు సాయి శ్రీయ. మంచిర్యాల జిల్లా జన్నారం కి చెందిన అటవీశాఖ లో పని చేస్తున్న రాము, సురేఖల పెద్ద కుమార్తె సాయి శ్రీయ కు రామకృష్ణాపూర్ కి చెందిన ఆకుల శివ తో ఈ నెల 14 వ తేదీన వివాహం జరిగింది. అప్పగింతల సమయంలో వధువు వరుని కోసం ఈ బుల్లెట్ బండి పాటకి డ్యాన్స్ చేసింది.

అయితే తమ బుల్లెట్టు బండి పాట కి డ్యాన్స్ చేసిన ఈ వధువుకి ఆ పాట ని నిర్మించిన సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ  పాటని బ్లూరాబిట్ ఎంటర్తైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఈ సంస్థ వారు ఈ వధువుకు ఫోన్ చేసి మాట్లాడి, వారు తీయబోయే తరువాత వీడియోలో తనను నటించాల్సిందిగా అడగడం జరిగింది,. దీనితో ఆనందానికి అవధుల్లెవని చెప్పొచ్చు. సరదాగా తన భర్త కోసం చేసిన ఈ డ్యాన్స్ ఇంత పాపులారిటీని తెచ్చి పెడుతుందని ఊహించలేదని ఆమె చెబుతోంది.

ఈ పాటని ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడటం జరగగా, లక్ష్మణ్ ఈ పాటకి సాహిత్యాన్ని, బాజీ సంగీతాన్ని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *