May 12, 2025

Digital Mixture

Information Portal

#Chiru153: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… “గాడ్ ఫాదర్” షూటింగ్ ప్రారంభం…

1 min read
#Chiru153, Chiranjeevi 153 Movie Updates,

Chiru Lucifer..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 153 వ చిత్రం లూసిఫర్ సినిమా కి  రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రకటన ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తిందని చెప్పొచ్చు. అదేంటంటే మెగాస్టార్ 153 వ సినిమా షూటింగ్ ఈ రోజునుండి ప్రారంభం కానుంది. ఈ  ఆగస్టు 13 న హైదరాబాద్ లో ఈ సినిమా  షూటింగ్ మొదలు కానుంది. దీనికోసం హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఒక ప్రత్యేకమైన సెట్ ని వేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పొలిటికల్, యాక్షన్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ సినిమా కి  గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Chiru Latest…

ఆగుస్ట్ 22 న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నం చేస్తోంది. ఈ సినిమాలో పాత్ర కోసం చిరంజీవి చాలా బరువు తగ్గాడు. ఈ మధ్య విడుదలైన లేటెస్ట్ ఫొటోస్ చూస్తేనే అర్ధమవుతుంది.

ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నడు, మోహన్ రాజా దర్శకత్వం వశిస్తున్న ఈ సినిమాని రామ్ చరణ్ తో కలిసి ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.  

Chiru Latest

అయితే చిరంజీవి ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. నాలుగు లేదా ఐదు నెలల్లో పూర్తి చేసే ప్రణాళికలో సిద్ధం చేస్తున్నారట. దీని తర్వాత వేదాళం రిమేక్ తో పాటు బాబీ డైరెక్షన్ లో సినిమాలను కూడా షూటింగ్ ని త్వరగా ప్రారంభించాలని చూస్తున్నాడట మెగాస్టార్. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *