May 12, 2025

Digital Mixture

Information Portal

Cricket News: హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్… ఆసీస్ కి తప్పని ఓటమి…3rd T20 Ban Vs Aus

1 min read
Bangladesh vs Australia 3rd T20

Bangladesh vs Australia 3rd T20

3-0 ఆధిక్యంతో బంగ్లా సీరిస్ కైవసం…

అసలు ఆస్ట్రేలియా జట్టుకు ఏమైంది. వరుసగా ఓటములను చవిచూస్తోంది. ఆసీస్ జట్టుకు ఆతిధ్య బంగ్లాదేశ్‌ మరోసారి భారీ షాక్‌ ఇచ్చింది. తొలి రెండు టీ20లలో ఆస్ట్రేలియాను ఓడించి బంగ్లాదేశ్  ఇప్పటికే సంచలనం సృష్టించింది. మూడో టీ20 కూడా గెలవడంతో తాము  ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది. శుక్రవారం రాత్రి ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియాను 10 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్.. ఐదు టీ20ల సిరీస్‌లో 3-0 తో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ 127 పరుగుల లక్ష్యాన్నిఆసీస్ ముందుంచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. కెప్టెన్​ మహ్మదుల్లా (53 బంతుల్లో 52 పరుగులు), ఆల్​రౌండర్​ షకిబుల్​ హసన్​ (17 బంతుల్లో 26 పరుగులు)  తప్ప ఎవరూ  రాణించలేదు. నయిం (1), సర్కార్ (2), హుస్సేన్ (3) పరుగులతో అవుటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో డెబ్యు మ్యాచ్​ ఆడుతున్న నాథన్​ ఎల్లిస్ హ్యాట్రిక్​తో రికార్డు క్రియేట్ చేసాడు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్​ నాథన్​ ఎల్లిస్ ​ రికార్డు సృష్టించాడు. తొలుత 3.3 ఓవర్లకు 34 పరుగులు ఇచ్చిన ఎల్లిస్​.. ఆఖరి  మూడు బాల్స్ కి  మూడు వికెట్లు తీశాడు.

లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా​ ఘోరంగా విఫలమైందని చెప్పొచ్చు. 4 వికెట్లే నష్టపోయిన ఆస్ట్రేలియా అత్యుత్తమ బ్యాట్స్​మెన్​ చివరి వరకు క్రీజులో ఉండి కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. ఒక దశలో ఆసీస్ ఆట టెస్ట్ క్రికెట్ ని తలపించిది. మెక్​ డెర్మట్​ (41 బంతుల్లో 35 పరుగులు), మిచెల్ మార్ష్ (47 బంతుల్లో 51 పరుగులు) చేసినా ఆసీస్ విజయాన్ని అందుకోలేకపోయింది. బంగ్లాదేశ్  బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసారు. ​ 4 ఓవర్లలో 9 పరుగులిచ్చిన పేసర్ ముస్తాఫిజుర్​ రెహ్మాన్ ఆసీస్ ని కట్టడి చేసాడు. ఇస్లాం 2.. షకీబుల్​, నసుం అహ్మద్​ చెరొక వికెట్​ తీశారు. ​

ఇంకా రెండు మ్యాచులు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ 3-0 ఆధిక్యంతో సీరిస్ ని కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌ కెప్టెన్ మహ్మదుల్లాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మహ్మదుల్లా 52 పరుగులతో బంగ్లాదేశ్ విజయంలో కీలకంగా మారాడు. సిరీస్​లో తదుపరి మ్యాచ్​ శనివారం జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *