May 12, 2025

Digital Mixture

Information Portal

Cricket News: IND vs ENG 2nd Test: పటిష్ట స్థితిలో భారత్…

1 min read
Ind vs Eng 2nd Test

Kl Rahul

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో ఉంది. మొదటి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. రెండవ టెస్టు లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకంది. బ్యాటింగ్ కి దిగిన భారత్ మొదటి రోజు మొదటి ఇన్నిగ్స్ లో 276 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.

ఓపెనర్స్ కె.ఎల్ రాహుల్, రోహిత్ శర్మ మొదట ఆచితూచి ఆడటం జరిగింది. ఈ టెస్టు లో రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడి 83 పరుగుల వద్ద అవుటయ్యాడు. రోహిత్ శర్మ టెస్టుల్లో 13 వ అర్ధ సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు.

మరో ఓపెనర్ కె.ఎల్ రాహుల్ మొదటి టెస్టులో మాదిరిగా ఆకట్టుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన కె.ఎల్ రాహుల్ ఆట ముగిసే సమయానికి 127 పరుగులు చేసాడు. లార్డ్స్ మైదానంలో 100 పరుగుల మైలురాయిని సాధించిన మూడవ భారత ఓపెనర్ గా నిలిచాడు.

రెండవ టెస్టులో కూడా చేతెశ్వర్ పూజారా నిరాశ పరిచాడని చెప్పొచ్చు. 9 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. తరువాత వచ్చిన కెప్టైన్ విరాట్ కోహ్లి ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. పరుగులు చేయడానికి కొంచెం కష్ట పడ్డ కోహ్లి 40 పరుగులవద్ద అవుట్ అయ్యాడు.

ఇంగ్లాండ్ బౌలర్స్ లో జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లు తెసుకోగా, రాబిన్సన్ కి ఒక వికెట్ దక్కింది.

ప్రస్తుతం ఆట ముగిసే సమయానికి 276 /3 పరుగుల తో కె.ఎల్ రాహుల్ , అజిక్య రహనే క్రీజులో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *