IND vs ENG 2nd Test లార్డ్స్ టెస్టు లో భారత్ చారిత్రాత్మక విజయం… భారత పేస్ బౌలర్ల దాటికి కుప్పకూలిన ఇంగ్లాండ్…
1 min read
Ind Vs Eng India victory over England in the 2nd Test
151 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం… 1-0 ఆధిక్యం లో భారత్…
ఇంగ్లాండ్ భారత్ మధ్య లార్డ్స్ లో జరుగుతున్న రెండవ టెస్టులో చివరి రోజు ఆట రసవత్తరంగా సాగి విజయం భారత్ ని వరించింది. ఓవర్ నైట్ స్కోర్ 181 /6 తో ఐదో రోజు ఆటని ప్రారంభించిన భారత్, 22 పరుగులు చేసిన రిషబ్ పంత్ అవుటయ్యాడు.కొద్ది సేపటికే ఇషాంత్ శర్మ 16 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.
దీనితో భారత్ తక్కువ స్కోర్ కే ఆలౌట్ అవుతుందని అందరూ ఊహించారు. కానీ ఎవరూ ఉహించని విధంగా మహమ్మద్ షమీ హాఫ్ సెంచరీ చేయడం, జస్ప్రీత్ బుమ్ర 34 పరుగులు చేసారు. వీరిద్దరూ కలిసి వికెట్ పడకుండా సింగిల్స్ తీస్తూ మధ్య మధ్యలో బౌండరీలు బాదుతూ స్కోరును ముందుకు తీసుకెళ్ళారు. వీళ్ళిద్దరూ కలిసి 89 భాగస్వామ్యం జోడించారు. దీనితో భారత్ 298 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
ఆ తరువాత 272 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ మొదటి ఓవర్ నుండే వికెట్లు కోల్పోయింది. భారత పేసర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ పై విరుచుక పడ్డారు. మొదటి నుండే కట్టడి చేస్తూ వికెట్స్ తీసారు. కెప్టెన్ జో రూట్ (33), బట్లర్ (25) తప్ప ఇంకెవరు పెద్దగా స్కోరు చేయక పోవడంతో భారత్ 151 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత బౌలర్ల లో సిరాజ్ 4 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్ల తో భారత్ కి విజయాన్ని అందించారు.
