IND vs ENG 3rd Test: మూడో టెస్టు లో ఇంగ్లాండ్ ఘన విజయం… ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి కుప్పకూలిన టీమ్ ఇండియా…
1 min read
England won by an innings and 76 runs
1-1 తో సీరిస్ సమం చేసిన ఇంగ్లాండ్…
ఇన్నింగ్స్ 76 పరుగులతో ఇంగ్లాండ్ గెలుపు…
ఒత్తిడికి లోనయ్యామన్న టీమ్ ఇండియా కెప్టైన్ విరాట్ కోహ్లీ…
మూడో టెస్టులో 4 వ రోజు భారత్ రెండవ ఇన్నింగ్స్ ఓవర్ నైట్ స్కోరు 215 / 2 తో ప్రారంభించింది. ఆట మొదలైన కొద్ది సేపటికే పరుగులేమీ చేయకుండానే పూజారా వికెట్ ని కోల్పోయింది. దీనితో పూజారా 91 పరుగులకే అవుటై సెంచరీ ని చేజార్చుకున్నాడు.
తరువాత విరాట్ కోహ్లీ అవుటైనంత పని చేసి రివ్యూ తీసుకొని బతికిపోయాడు. అర్ధ సెంచరీ చేసిన కోహ్లీ కొద్ది సేపటికే వికెట్ల ముందు దొరికిపోయాడు. 237 పరుగుల వద్ద భారత్ 4 వ వికెట్ కోల్పోయింది. దీనితో భారత్ కోలుకోలేని స్థితిలో పడిపోయింది.
కొద్ది సేపటికి భారత్ రహనే (10), పంత్ (1) వికెట్లు కోల్పోయింది. టీమ్ ఇండియా వరుసగా వికెట్లు కోల్పోతూ పరాజయానికి దగ్గరైంది. షమీ (6), ఇషాంత్ (2) జడేజా (30), సిరాజ్ (0) అవుటవడంతో భారత్ 278 పరుగులకు ఆలౌట్ అవటంతో ఒక ఇన్నింగ్స్ 76 పరుగులతో ఓటమి పాలైంది.
ఇంగ్లాండ్ బౌలర్లు భారత బ్యాట్స్ మెన్ పై విరుచుక పడ్డారని చెప్పొచ్చు. రాబిన్సన్ 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలకంగా మారాడు. క్రేగ్ ఓవర్టన్ 3 వికెట్లు తీసుకోగా అండర్సన్, అలీ చెరొక వికెట్ తీసుకున్నారు.
