#HBDMEGASTARCHIRANJEEVI రేపు సర్ప్రైస్ లతో సందడి చేయనున్న మెగాస్టార్ అండ్ టీమ్… ఫ్యాన్స్ ఇక సిద్ధమవ్వండి… #SupremeReveal, #Chru153 #MEGA154,
1 min read
Mega surprises For Fans, Image Source: Twitter
రేపు టాలీవుడ్ మెగాస్టార్, తెలుగు సినిమాలను ఆదరించే వారందరికీ అన్నయ్య రేపు తన 66 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈయన పుట్టిన రోజును ఫ్యాన్స్ తమ పుట్టిన రోజుకంటే ఎక్కువగా జరుపుకుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే అనేక సామాజిక సేవాకార్యక్రమాలతో ఆయన పుట్టిన రోజును అంగరంగ వైభవంగా జరుపుతారు. ఎప్పటిలాగే ఈసారి కూడా కోవిడ్ నిబంధలను పాటిస్తూ మెగాస్టార్ పేరిట అనేక సేవా కార్యక్రమాలు, పూజలు, హోమాలు చేస్తున్నారు.
అయితే ఈ సారి ఫ్యాన్స్ సంబరాలు రెట్టుంపు కానున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మెగాస్టార్ సినిమాల కి సంబంధిచిన అప్డేట్స్ రానున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆచార్య విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వేసవిలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లేట్ అవటంతో సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఫ్యాన్స్ ఆచార్య సినిమా దసరా పండగకి తప్పకుండా విడుదల అవుతుందని ఆశ పడ్డారు. కానీ అదీ జరగదని ఫ్యాన్స్ కి అర్ధమయింది. మిగతా హీరోలందరూ తమ సినిమా విడుదల తేదీలను ఎప్పుడో ప్రకటించేశారు. అయితే రేపు పుట్టిన రోజు సందర్భంగా ఆచార్య విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
అలాగే ఫ్యాన్స్ కి ఒక రోజు ముందుగానే సర్ప్రైస్ ప్లాన్ చేసింది కొణిదెల ప్రొడక్షన్, అదేంటంటే చిరు 153 వ చిత్రం లూసిఫర్ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం 5.04 ని. సుప్రీమ్ రివీల్ ఆఫ్ #చిరు153 అని కొణిదెల ప్రొడక్షన్ వారు ప్రకటించారు. అయితే చిరు 153 వ సినిమా లూసిఫర్ రిమేక్ సినిమా టైటిల్ ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే చిరంజీవి తన తరువాతి సినిమాలు మెహెర్ రమేష్, బాబీలతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మొహర్ రమేష్ “గెట్ రెడీ ఫర్ మెగా యుఫోరియా: పేరుతొ రేపు ఉదయం 9 గంటలకి ఫ్యాన్స్ కి సర్ప్రైస్ ప్లాన్ చేసాడు.
అలాగే దర్శకుడు బాబీ కూడా తను మెగాస్టార్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ ని రేపు మ. 4.05 గంటలకు ఇవ్వనున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇలా రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఫ్యాన్స్ కి ఫుల్ ఆఫ్ సర్ప్రిసేస్ తో ఉండనుంది.
