May 12, 2025

Digital Mixture

Information Portal

Official #Tuckjagadish: వినాయక చవితికి అమెజాన్ లో నాని”టక్ జగదీష్”…

1 min read
Tuck Jagadish release date,

Tuck Jagadish

చాలా రోజులుగా నడుస్తున్న డ్రామా కి తెర పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో ఇంతకుముందు ఎప్పుడు ఒక సినిమా రిలీజ్ విషయం లో ఇలా జరగలేదని చెప్పొచ్చు. ఈ విషయం లో ఒక హీరోని టార్గెట్ చేయడం, మీడియాకి ఎక్కడం మనం చూస్తూనే ఉన్నాం.

ఈ సినిమాటిక్ డ్రామా అంతా హీరో నాని టక్ జగదీష్ విడుదల విషయం లో జరిగిన విషయం తెలిసిందే. చివరిగా హీరో నాని ప్రకటనతో ఈ డ్రామా కి శుభం కార్డ్ పడింది. ఒటిటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్  వేదికగా సెప్టెంబర్ 10 వ తేదీ వినాయక చవితి సందర్భంగా టక్ జగదీష్ విడుదల కానున్నట్టు నాని ప్రకటించేసాడు.

పండగ కి మన ఫ్యామిలీతో మీ #Tuckjagadish అంటూ సోషల్ మీడియా ద్వారా తన సినిమా అమెజాన్ వీడియో లో విడుదల అవుతున్నట్టు ప్రకటించేసాడు. దీనికి సంబంధించిన అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ తో ట్రైలర్ విడుదల చేసారు.

#Tuckjagadish ప్రకటనతో, అదే రోజు థియేటర్లో విడుదల కాబోతున్నట్టు ప్రకటించిన శేఖర్ కమ్ముల, నాగ చైతన్య “లవ్ స్టోరీ” సినిమా విడుదల తేదీ ఇప్పుడు సందిగ్ధం లో పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అసలే కరోనా కారణంగా థియేటర్లకు రాని ప్రేక్షకులు, ఇప్పుడు అదే రోజు నాని లాంటి హీరో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంటే ఆమాత్రం ప్రేక్షకులు కూడా థియేటర్ల వైపు కన్నెత్తి చూడరని డిస్ట్రిబ్యూటర్ల వాదన. అందుకోసమే నాని సినిమాని విడుదల తేదీని మార్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసారు లవ్ స్టోరీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్సిబిటర్లు. కానీ ఆర్ధిక పరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నాని ఈ #Tuckjagadish విడుదల ని నిర్మాతలకే వదిలేసాడు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా విడుదల కాని సంగతి తెలిసిందే. థియేటర్లో విడుదల చేస్తే ప్రేక్షకులు రాకపోతే పెట్టిన డబ్బులు రాబట్టడం కష్టమని, ఇప్పటికే వడ్డీ పేరుతొ నిర్మాతలకి భారం ఎక్కువైనట్టు తెలుస్తోంది, ఇంతలో ఒటిటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ నుండి భారీ డీల్ రావటంతో నిర్మాతలు ఒటిటీ వైపు తలొగ్గారు.

నిర్మాతల పరంగా ఈ నిర్ణయం సరైనప్పటికీ, హీరో పరంగా  నాని కి మాత్రం థియేటర్లో విడుదల అయితేనే మంచిదని కొందరి వాదన. కానీ తనని హీరోగా నిలబెట్టిన నిర్మాతల గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత తనకి ఉంది కాబట్టి, తనకి ఇష్టం లేకపోయినా నాని ఈ నిర్ణయానికి ఒటేసినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *