May 12, 2025

Digital Mixture

Information Portal

Nithin #Maestro: ఓటీటీ లో విడుదల తేదీ ఖరారు చేసుకున్న నితిన్ “మాస్ట్రో”

1 min read
Nithin Maestro OTT release date confirmed

Nithin Maestro OTT release date confirmed

ఎన్నో రోజులనుండి విడుదల విషయంలో సందిగ్ధంలో ఉన్న నితిన్ మాస్ట్రో సినిమా ఒక్క కొలిక్కి వచ్చింది. మొదట వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల కన్ఫర్మ్ అని వార్తలు వచ్చాయి. కానీ ఇంతలో నాని టక్ జగదీష్ సినిమా విడుదల విషయం లో రభస జరిగిన విషయం తెలిసిందే. దీనితో నితిన్ మాస్ట్రో సినిమా విడుదల విషయం లో కొంత వెనక్కి తగ్గి విడుదల తేదీని ప్రకటించకుండా  కొన్ని రోజుల వరకు ఆపారు. నాని ఈమధ్యే తన సినిమా అమెజాన్ వేదికగా సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల అవుతున్నట్టు ప్రకటించాడు. దీనితో మాస్ట్రో సినిమాకి లైన్ క్లీయర్ అయింది. వెంటనే నితిన్ తన సినిమా ఓటీటీ విడుదల తేదీని పకటించాడు.

నితిన్ మాస్ట్రో సినిమా డిస్నీప్లస్ హాట్ స్టార్ వేదికగా సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల అవుతున్నట్టు ఒక పోస్టర్ విడుదల చేసారు. అంటే నాని సినిమా విడుదల అయిన వారం రోజుల తరువాత నితిన్ తన సినిమాని విడుదలకి ప్లాన్ చేసుకున్నాడు. ఇది బాలీవుడ్ హిట్ మూవీ అంధాదున్ కి అధికారిక రీమేక్ ఈ మాస్ట్రో సినిమా.

 ఈ సినిమాని నితిన్ నిర్మిస్తుండగా, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది బ్లాక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. మహతి స్వాగర్ సంగీతం అందించారు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. మిగతా పాత్రల్లో సీనియర్ నరేష్,  జిషుసేన్ గుప్తా,  శ్రీముఖి, అనన్య,  హర్షవర్ధన్,  రచ్చ రవి,  మంగ్లీ,  శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *