May 12, 2025

Digital Mixture

Information Portal

Urvasi Sharada: నేను బతికే ఉన్నా… దయచేసి తప్పుడు వార్తలు నమ్మొద్దు…

1 min read
Rumors on Urvasi Sharda's death

Rumors on Urvasi Sharda's death

సీనియర్ నటి, ఊర్వశి శారద కన్ను మూశారంటూ ఈ రోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో అటు అభిమానులు, ఇటు సినీ పరిశ్రమ లోని నటులు ఆందోళనకు గురయ్యారు. అసలు ఈ వార్త నిజమా కాదా అని స్పష్టత కోసం వేచి చూసారు.

విషయం తెలుసుకున్న ఊర్వశి శారద ఈ వార్తలపై స్పష్టత ఇచ్చారు. “నేను బతికే ఉన్నా నా ఆరోగ్యం బాగానే ఉన్నది”. ఒంట్లో కాస్త నలతగా ఉంది. దయచేసి వాట్సాప్ ద్వారా షేర్ చేసే వార్తలను నమ్మవద్దు. ఒక వ్యక్తి చేసిన పనికి ఇలా అందరు ఆందోళనకు గురవుతున్నారు, నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఇలాంటి వార్తలను నమ్మవద్దు. నిజానిజాలు తెలువకుండా ఇలాంటి వార్తలు వ్యాప్తి చేయడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *