May 12, 2025

Digital Mixture

Information Portal

Hyderabad Crime News: హైదరాబాద్ లో దారుణం…పట్టపగలే యువతి పై అత్యాచారం…

1 min read
Hyderabad Youg Girl Raped By Auto Driver

Hyderabad Youg Girl Raped By Auto Driver

దారి మళ్ళించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళిన ఆటో డ్రైవర్….

రాజధాని నగరం మరోసారి తలదించుకునేలా పట్టపగలే యువతి పై దారుణం జరిగింది. యువతి తాను పనిచేసే ప్రాంతానికి వెళ్లేందుకు ఆటో ఎక్కగా, ఆటో డ్రైవర్ తాము దగ్గరి దారిలో వెళ్దామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి, ఆమెపై అత్యాచారానికి పాల్పాడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరధిలో జరిగింది. దీనితో భాగ్యనగరం ఒక్కసారి ఉలిక్కిపడింది.

సంతోష్ నగర్ పరిసర ప్రాంతం లో నివసిస్తున్న యువతి (20) మైలార్ దేవ్ పల్లి లో ల్యాబ్ టెక్నిషియన్ గా పనిచేస్తోంది. రోజూ తను ల్యాబ్ కి క్రమంలో నిన్న బుధవారం మద్యాహ్నం 2.30 గంటల ప్రాంతం లో ఆటో ఎక్కడం జరిగింది. మైలార్ దేవ్ పల్లి తీసుకెళ్ళకుండా ఆటోని దారి మళ్ళించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అ యువతిని అక్కడే వదిలేసి వెళ్ళాడు. సాయత్రం ఆమె తేరుకొని, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఆమె ఇంకా షాక్ లోనే ఉన్నట్టు  తెలుస్తోంది. అయితే ఇది సామూహిక అత్యాచారమా కాదా అని తెలుసుకోవడానికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.

గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు…

బాధితురాలు చెప్పిన ప్రకారం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. బాధితురాలు ఆటో ఎక్కిన ప్రాంతం నుండి మైలార్ దేవ్ పల్లి వెళ్ళే దారిని, అటువైపు వెళ్ళడానికి ఏవైనా వేరే దారులు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. అలాగే ఆ రహదారి లో ఉన్న సీసీ కేమరాల ఆధారంగా అటువైపుగా వెళ్ళిన వాహనాలను పరిశీలిస్తున్నారు. అలాగే ఆ ప్రాంత ఆటో డ్రైవర్లను విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *