May 12, 2025

Digital Mixture

Information Portal

“బలగం” చిత్రానికి మరో అంతర్జాతీయ అవార్డు- Another International Award for Balagam Movie

1 min read
Another International Award For Balagam Movie

Another International Award For Balagam Movie

బలగం” చిత్రం ఇప్పటి వరకు నాలుగు అవార్డులను అందుకోవడం విశేషం.

Balagam Telugu Movie, Tollywood News, Telugu Cinema, Another International Award For Balagam Movie,
Balagam Telugu Movie

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు బలగం. తెలంగాణా పల్లె  సంస్కృతి, సాంప్రదాయాలను ఉన్నది ఉన్నట్టుగా చూపించడంతో తెలంగాణా ప్రజలతో పాటు తెలుగు ప్రజలు అంతా ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించారు. ఇప్పుడు తెలంగాణా పల్లెల్లో ఈ బలగం సినిమాని పెద్ద స్క్రీన్ల పైన ఊరు మొత్తానికి చూపిస్తున్నారు. సినిమా థియేటర్ల వరకు వెళ్లి చూడలేని వారికోసం ఈ బలగం సినిమాని వాళ్ళ ఊర్లో ప్రదర్శిడంతో పల్లెటూర్లలో బలగం సందడి మొదలైందని చెప్పొచ్చు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులకోసం కూడా ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడం జరిగింది.

 ఇలాంటి ప్రేక్షకారదరణ పొందిన సినిమాకి అవార్డులు ఒకదాని వెంట మరొకటి వరుస కడుతున్నాయి. ఇప్పటికే థియేటర్లో అలాగే ఓటీటీ లో కూడా దూసుకుపోతున్న ఈ బలగం సినిమాకి ఇప్పటి వరకు నాలుగు అవార్డులు సొంతం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. అలాగే తెలుగు సంవత్సరాది ఉగాది పురస్కారాల నంది అవార్డును దక్కించుకుంది. తాజాగా ఈ బలగం సినిమా ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు చేరింది. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఒనికో ఫిల్మ్ అవార్డు (ఉక్రెయిన్ ) సొంతం చేసుకుంది.

ఈ బలగం సినిమా కథ విషయానికి వస్తే ఓ ఇంటి పెద్ద మరణం  నేపథ్యం లో తెలంగాణా లో ఉండే సంస్కృతి సాంప్రదాయాలను ఆధారంగా చేసుకొని రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, రూపా లక్ష్మి, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దర్శకుడు వేణు ఎల్దండి, కమెడియన్ గా సినిమా కెరియర్ ని ప్రారంభించి, జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ పొందాడు. తర్వాత సినిమాలకి దూరంగా ఉండి, ఇప్పుడు ఈ బలగం సినిమా ద్వారా మనముందుకు వచ్చి తనలోని దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమా ప్రముఖుల ప్రశంశలు అందుకుంటున్నాడు.

ఈ బలగం సినిమాకి మరిన్ని అవార్డులు  రావాలని ఆశిద్దాం.

2 thoughts on ““బలగం” చిత్రానికి మరో అంతర్జాతీయ అవార్డు- Another International Award for Balagam Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *