May 12, 2025

Digital Mixture

Information Portal

శంకర్ దర్శకత్వంలో హీరో సిద్దార్థ్… ఏ సినిమానో తెలుసా…

1 min read
Hero Siddarth Confirmed In Shankar's Indian 2

Hero Siddarth Confirmed In Shankar's Indian 2

లక్కీ ఛాన్స్ కొట్టేసిన మల్టీ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్

ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ రెండు సినిమాలను పట్టలెక్కిస్తున్నారు. అవి కమలహాసన్ ఇండియన్-2 మరియు రామ్ చరణ్ గేమ్ చేన్జర్. అయితే కొద్ది రోజులుగా హీరో సిద్ధార్థ్ శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

ఈ రోజు సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఈ వార్తలను నిజం చేస్తూ లైకా ప్రొడక్షన్స్ వారు ఒక అఫీషియల్ ప్రకటన చేయడం జరిగింది. హీరో సిద్ధార్థ్ తాము నిర్మిస్తున్న కమలహాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ -2 లో నటిస్తున్నట్టు ప్రకటించారు. ఇండియన్-2 టీమ్ తరుపున పుట్టినరోజు విషెస్ ని తెలియజేస్తూ, ఈ సినిమాలో సిద్ధార్థ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఇప్పుడు ఈ పిక్ ని సిద్ధార్థ్ అభిమానులు నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు. సిద్ధార్థ్ శంకర్ దర్శకత్వంలో ఇంతకుముందు బాయ్స్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. దాదాపు 14 సంవత్సరాల తరువాత సిద్ధార్థ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తుండటం విశేషం.

ఈ చిత్రంలో కాజర్ అగర్వాల్, రాకుల్ ప్రీత్ సింగ్, బాబి సింహ, సముధ్రఖని తదితరులు నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *