May 12, 2025

Digital Mixture

Information Portal

#OG : స్టైలిష్ గా మొదలు పెట్టిన పవర్ స్టార్…

1 min read
Pawan Kalyan @ #OG Sets, @DVVMovies

Pawan Kalyan @ #OG Sets, Image Source: Twitter @DVVMovies

ఈ రోజు ముంబయి లో #OG సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడం జరిగింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా DVV దానయ్య నిర్మిస్తున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీగా గడిపాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తవగానే #OG సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ లో పాల్గొనడానికి ముంబయి చేరుకున్నాడు.

ఈ #OG షూటింగ్ లోకేషన్స్ కి పవర్ స్టార్ వచ్చిన ఫోటోలను, వీడియోని DVV ఎంటర్తైన్మెంట్ వారు సోషల్ మీడియా లో అభిమానుల కోసం విడుదల చేసారు. పవన్ లుక్, ఎంట్రీ అదిరిందని చెప్పొచ్చు. ఈ ఫోటోలను అభిమానులు  తెగ వైరల్ చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకేసారి నాలుగు సినిమాలను ప్రణాళికగా షూటింగ్ కి సమయం కేటాయిస్తున్నాడు. హరిహర వీరమల్లు ముప్పావు శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయింది. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కావాల్సి వచ్చింది. ఇప్పుడు #OG సినిమా షూటింగ్ ప్రారంభించాడు. పవర్ స్టార్ ఇప్పుడు అందరి హీరోల కంటే ఎక్కువ బిజీ బిజీ గా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం రావణాసుర దర్శకుడు సుధీర్ వర్మ తో ఒక రిమేక్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రావణాసుర సినిమా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకొని రవితేజ ఖాతాలో మరో పరాజయాన్ని చేర్చింది. దీనితో పవన్ ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *