సిల్వర్ స్క్రీన్ ని రూల్ చేయడానికి వస్తున్న పుష్ప Pushpa: The Rule release date
1 min read
Pushpa The Rule release date
పుష్ప: ద రూల్ విడుదల తేదీ ప్రకటన
ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. పుష్ప రెండవ పార్ట్ పుష్ప: ది రూల్ విడుదల వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంత సంతోషం తో పాటు తమ అభిమాన హీరో సినిమా చూడాలంటే ఇంకా అన్ని రోజులు వేచి ఉండాలనే అసంతృప్తి లో ఉన్నారని చెప్పొచ్చు.
పుష్ప మొదటి భాగం పుష్ప: ది రైజ్ ఎంత పెద్ద హిట్ ని సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. దర్శకుడు సుకుమార్ ఈ సినిమా ని అత్భుతంగా తెరకెక్కించాడు. మాస్ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటన కి, మ్యానరిజం కి నార్త్ సినిమా అభిమానులు ఫిదా అయిపోయారు. దీనితో ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ కి కూడా మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఒక రకంగా అల్లు అర్జున్ ఇండియాలోని మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. దీనితో తరువాత రాబోయే రెండవ భాగం పుష్ప: ది రూల్ మీద విపరీతమైన బజ్ ఏర్పడింది. ముఖ్యంగా బాహుబలి 2 తరువాత నార్త్ ఇండియన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప ది రూల్.

ఈ మధ్యనే సినిమా రంగానికి సంభందించి కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను జాతీయ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా పుష్ప: ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ నటన కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. దీనితో పుష్ప: ది రూల్ కి మరోసారి వార్తల్లో నిలిచింది. కానీ ఈ సినిమాని థియేటర్లలో చూడాలంటే దాదాపుగా ఇంకొక సంవత్సరం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాని 15 ఆగస్ట్ 2024 లో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాని మొదట 2024 వేసవికి విడుదలకి సన్నాహాలు చేసారు. కానీ పుష్ప: ది రైజ్ కి పలు జాతీయ అవార్డులు రావడం తో దర్శకుడి పై మరిన్ని కొత్త భాద్యతలు ఏర్పడ్డాయి అని చెప్పొచ్చు. దీనితో రెండవ భాగాన్ని కూడా ఆ స్థాయికి తగ్గకుండా ఏమైనా మార్పులు చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అలాగే ఈ సినిమాని ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేస్తుండటం తో, మరి ఈ సినిమాలో జాతీయ సమస్యల గురుంచి ఏమైనా చర్చించడం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఆ మధ్య విడుదలైన గ్లింప్సె లో ప్రజల సమస్యల గురించి పోరాడే పుష్ప ని చూపించారు. మరి పుష్ప జాతీయ స్థాయిలో రూల్ చేయబోతున్నాడా అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
అలాగే ఈ సినిమా విడుదల తరువాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
