May 13, 2025

Digital Mixture

Information Portal

Kalki 2898 AD overtakes RRR

1 min read
Kalki 2898 AD beats RRR

Kalki 2898 AD beats RRR

RRR ని దాటేసిన Kalki 2898 AD

ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా  Kalki 2898 AD  గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ సినిమా కథ, ఇందులో నటించే సూపర్ స్టార్స్ ఇలా చెప్పుకుంటూ పొతే చాలా విషయాలు ఉన్నాయి. ఇండియాలో ఉన్న పెద్ద నటులందరూ ఈ Kalki 2898 AD లో ప్రభాస్ తో పోరాటబోతున్నారు. మహానటి సినిమాతో అందరిని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు నాగ అశ్విన్. ఈ Kalki 2898 AD సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచేదిగా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తెనే  అర్ధమవుతుంది.

 ఈ Kalki 2898 AD సినిమా ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ సంపాదించి ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని చూపించింది. అయితే ప్రభాస్ Kalki 2898 AD సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి రెడి అవుతోంది.

Kalki 2898 AD,Kalki 2898 AD collections,Kalki 2898 AD release date,Kalki 2898 AD Box office collections,Kalki 2898 AD records,Prabhas,Actor Prabhas,Deepika Padukone,Amitabh Bacchan,Kamal Haasan,Nag Ashwin
Kalki 2898 AD

Kalki 2898 AD ఈ నెల 27 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.  విడుదలకు ముందే Kalki 2898 AD టికెట్ల అమ్మకాలలో కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతోంది. ఇప్పటి వరకు ఈ రికార్డ్   ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా పేరిట ఉంది. విదేశాలలో ఈ సినిమా విడుదల కి ముందే టికెట్ల అమ్మకాలతో త్వరగా  $1 మిలియన్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Kalki 2898 AD తో ఈ రికార్డుని బద్దలు కొట్టబోతున్నట్టు తెలుస్తోంది. Kalki 2898 AD  విడుదలకు చాలా రోజుల ముందుగానే టికెట్ల అమ్మకాలతో $2 మిలియన్ సునాయాసంగా రాబట్టనున్నట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి.

ఎందుకంటే బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు అభిమానులతో పాటు అన్నిరకాల భాషల నుండి అభిమానులు అమాంతం పెరిగిపోయారు. ప్రభాస్ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. Kalki 2898 AD ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులను ఆకట్టుకునేలా దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమా  తీసినట్టు తెలుస్తోంది.

Kalki 2898 AD సినిమాలో ప్రభాస్(Prabhas) తో పాటు, అమితాబ్ బచ్చన్ (Amitabh Bacchan), కమల్ హాసన్ (Kamal Haasan), దీపికా పదుకోన్ (Deepika Padukone), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), దిశ పటాని (Disha Patani) ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ (Santosh Narayanan) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బానర్ లో అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మిస్తున్నారు. విడుదల తేది 27 జూన్ 2024.

విడుదల తరువాత ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో వేచి చూడాలి.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *