కళ్యాణ్ రామ్ బింబిసార ప్రీక్వెల్ దర్శకుడు ఎవరు… Who is Bimbisara Prequel Director?
1 min read
Bimbisara Prequel
నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా తన సూపర్ హిట్ సినిమా బింబిసార కి ప్రీక్వెల్ పోస్టర్ ని విడుదల చేసారు. బింబిసార సినిమా తో మంచి హిట్ ని సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్, ఎప్పటి నుండో ఈ సినిమాకి ప్రిక్వెల్ గురుంచి చర్చ జరుగుతోంది. మధ్యలో చాలా సినిమాలు చేసిన కళ్యాణ్ రామ్ హిట్ ని సొంతం చేసుకోలేకపోయాడు. ఈ రోజు విడుదల అయిన పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా కూడా బింబిసార లాగే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని చెప్పొచ్చు.
అయితే బింబిసార ప్రిక్వెల్ కి మాత్రం దర్శకుడు మారినట్టు తెలుస్తోంది. బింబిసార సినిమాకి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఈ ప్రిక్వెల్ కి అనిల్ పదురి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిల్ పదురి ఇంతకు ముందు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ తో 2021 లో రొమాంటిక్ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అనుకున్నంత పేరుని తెచ్చిపెట్టలేదు. తర్వాత దర్శకుడిగా కాకుండా ఇతర హీరోల సినిమాలకు వివిధ విభాగాల్లో పని చేసాడు. నడమూరి కళ్యాణ్ రామ్ తో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చు. బింబిసార సినిమా కి దర్శకత్వం వహించిన వశిష్ట ఈ బింబిసార ప్రిక్వెల్ కి కూడా వహించాల్సి ఉంది. కానీ దర్శకుడు, కళ్యాణ్ రామ్ మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చి దర్శకుడు ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వశిష్ట మెగాస్టార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కోసమే వశిష్ట బింబిసార ప్రిక్వెల్ సినిమాని వదులు కున్నాడని సినిమా ఇండస్ట్రీ లో కొందరు చెప్పుకుంటున్నారు. దీనితో ఈ బింబిసార ప్రేక్వెల్ ని దర్శకత్వం చేసే అవకాశం అనిల్ పదురి కి వచ్చిందని తెలుస్తోంది. బింబిసార ప్రిక్వెల్ ని కొసరాజు హరిక్రిష్ణ నిర్మిస్తున్నారు.
