మే 3 తర్వాత కేంద్రం లాక్‌డౌన్‌ని పొడిగంచే అవకాశం…..
1 min read మే 3 తర్వాత కేంద్రం లాక్‌డౌన్‌ని పొడిగంచే అవకాశం….
ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడిగింపులకే మొగ్గు చూపుతున్నాయి. ఎదుకంటే మహారాష్ట్రలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తివేసే పరిస్థితి లేదని ఉద్దవ్ థాకరే చెబుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేస్తే కేసులు భారీగా పెరిగి వ్యవస్థ అతలాకుతలమవుతుందని అన్నారు. మరోవైపు కేంద్రం ఇచ్చిన సడలింపులను తప్పు పట్టింది ఢిల్లి ప్రభుత్వం.
ఇదే అభిప్రయాన్ని గుజరాత్, రాజస్తాన్,మధ్యప్రదేశ్, ఢిల్లి, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడుతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తోంది. తెలంగాణాలో మే 7 వరకు లాక్‌డౌన్‌ని కట్టు దిట్టంగా అమలు చేస్తామని సి.యం చెప్పారు. మరో నెల రోజులు ఇలానే ఉండవచ్చని ఆయన అభిప్రాయ పడ్డట్టు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తరువాత తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.
అయితే రేపు (ఏప్రియల్ 27) ప్రధాన మంత్రి అన్ని రాష్ట్రాల సీ.యం లతో వీడియో కాంఫరెన్స్ నిర్వహించనున్నారని సమాచారం. అయితే ఈ మీటింగ్‌లో మెజారిటీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ని మరో రెండు వారాలపాటు పొడిగంచాలని (అంటే మే 16 వ తేదీ వరకు) ప్రధాన మంత్రికి తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నారని తెలిసింది. ఒకవేళ మే 16వ తేదీ వరకు పొడిగిస్తే ఏవైనా కొత్త వెసులుబాటులను కల్పిస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే తెలంగాణాలో మాత్రం మే 7 వరకు లాక్‌డౌన్ ఉన్నందున, పొడగింపు విషయాన్ని ఇప్పుడే ప్రకటిస్తారా లెకుంటే, కేసుల ఉద్రుతిని బట్టి, ముందుగా చెప్పినట్టు మే 5 వ తేదీకి ప్రకటిస్తారా అనే దానికోసం ఎదురు చూడాల్సిందే.

