అభిమానులను రిక్వెస్ట్ చేసిన Jr. NTR…. నిరాశ పడొద్దని విన్నపం.
1 min readఅభిమానులను రిక్వెస్ట్ చేసిన Jr.NTR…. నిరాశ పడొద్దని విన్నపం.
Jr. NTR రేపు తన 38వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. Jr. NTR పుట్టినరోజును అభిమానులు పండగలా జరుపుకుంటారు. అయితే ఈసారి కరోనా వల్ల ఆ సంబరాలు చేసుకోవడానికి వీలులేకుండా పోయింది. దీనితో అభిమానులు కొంత నిరాశ చెందారనే చెప్పాలి.
అయితే Jr. NTR పుట్టినరోజు సందర్భంగా అభిమానులకోసం ఆర్ ఆర్ ఆర్ టీం టీజర్ లేదా ఫస్ట్ లుక్ విడుదల చేసి ట్రీట్ ఇస్తామని ప్రకటిచింది. దీనితో అభిమానుల అందానికి అవధుల్లేవని చెప్పొచ్చు. కానీ కరోనా కారణంగా టీజర్ లేదా ఫస్ట్ లుక్ కి సంభందిచిన పనులు పూర్తి కాకపోవడంతో ఎలాంటి టీజర్ లేదా ఫస్ట్ లుక్ Jr. NTR పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయలేక పోతున్నామని ఆర్ ఆర్ ఆర్ టీం ప్రకటించింది. దీనితో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
ఇది గ్రహించిన Jr. NTR twitter వేదికగా అభిమానులను రిక్వెస్ట్ చేసాడు. ఈ విపత్తు సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. అందరూ తన పుట్టిన రోజును ఇంటి పట్టునే భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని ఇదే మీరు నాకు ఇచ్చే విలువైన బహుమతి అని ఆయన అన్నారు.
అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి ఎలాంటి టీజర్ లేదా ఫస్ట్ లుక్ విడుదల కావటం లేదు, టీజర్ లేదా ఫస్ట్ లుక్ సిద్దం చేయాలని చిత్రబృందం కష్టపడింది, కానీ లాక్ డౌన్ కారణంగా ఇది సాధ్యపడలేదు. ఈ విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుందని నేను అర్ధం చేసుకోగలనని Jr. NTR అన్నారు.

