విజయ్ దేవరకొండకు మెగాస్టార్,సూపర్ స్టార్ సపోర్ట్
1 min readవిజయ్ దేవరకొండకు మెగాస్టార్,సూపర్ స్టార్ సపోర్ట్
విజయ్ దేవరకొండ, ఒక్క సినిమాతోనే సినిమా ఇండస్ట్రీని, విపరీతమైన అభిమాన గనాన్ని సంపాదించాడు. వరుస సినిమాలతో యూత్‌లో బాగా పాపులరిటీని సంపాదించుకున్నాడు. ఫాన్స్ ముద్దుగా రౌడీ అని పిలుస్తుంటారు.
అయితే సాదారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంత ఫేమస్ అయిపొతే అంతలా రూమర్స్ వాళ్ళపై వస్తుంటాయి. అందులో భాగంగా, కొద్దిరోజుల క్రితం రౌడీ తనను 4 వెబ్సైట్లు టార్గెట్ చేసాయి. నా గురించి ఫేక్ న్యుస్ రాస్తున్నాయి, నా కెరీర్ ని నాశనం చేయాలని చూస్తున్నాయాని తీవ్రంగా ఆరోపించాడు.
ఈ విషయంలో విజయ్ దేవరకొండకి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు మద్దతుగా నిలిచారు. వారు తమ మద్దతుని ట్విట్టర్ ద్వారా తెలిపారు. వీరితో పాటు,కొరటాల శివ, మెగా బ్రదర్ నాగబాబు తమ మద్దతును ప్రకటించారు.
కింగ్ నాగార్జున విజయ్ దేవరకొండకి మద్దతు పలుకుతూ, మద్దతుతో పాటు యాక్షన్ ప్లాన్ కూడా కావాలని మెగాస్టార్ చిరంజీవికి సూచించారు.
మెల్ల మెల్లగా సినిమా ఇండస్ట్రీ మొత్తం రౌడీ హీరోకి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అయింది.
మరి చిరంజీవి ముందుండి ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం తీసుకొస్తారో వేచి చూడాలి.
ఎంతైనా ఒకటి మాత్రం నిజం సినిమా ఇండస్ట్రీకి మీడియా, మీడియా వాళ్ళకు సినిమా ఇండస్ట్రీ ఒకరి అవసరం మరొకరికి ఎప్పటికీ ఉంటుంది.



