రానా, మిహికా బజాజ్ ల పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు.
1 min read
రానా, మిహికా బజాజ్ ల పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు.
రానా, మిహికా బజాజ్ ల పెళ్లి గురించి సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఈ సంవత్సరం డిసెంబర్ లోపు రానా, మిహికా వివాహం జరుగుతుందని చెప్పారు. ఇంకా ముందుగా జరిగినా ఆశ్చర్యం ఏమీ లేదని చెప్పుకొచ్చారు.
సురేష్ బాబు మాట్లాడుతూ, ఈ లాక్ డౌన్ మాకు పెళ్లి పనులు చేసుకోడానికి చాలా బాగా ఉపయోగ పడుతున్నదని ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా తగ్గుముఖం కనబడకపోవడంతో ఆగుస్టు 8 న కుటుంబసభ్యుల సమక్షంలో వివాహానికి సంబంధించిన ఓ ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. సామాజిక దూరం,ఇతర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ శుభకార్యం జరగనుంది అని సురేష్ బాబు తెలిపారు.

