వెంకటేష్, పూరి కాంబినేషన్ లో సినిమా?
1 min read
వెంకటేష్, పూరి కాంబినేషన్ లో సినిమా?
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి జగన్నాథ్ మళ్ళి ఫామ్ లోకి వచ్చాడనే చెప్పొచ్చు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా పూరి కొత్త సినిమా కథలు తయారు చేసే పనిలో పడ్డాడు. విజయ్ సినిమా తరువాత మహేష్ బాబు తో సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ మద్యలో పూరి విక్టరీ వెంకటేష్ కి ఒక కథ వినిపించడం జరిగింది. ఆ స్టోరీ లైన్ వెంకటేష్ కి బాగా నచడంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అది పట్టాలెక్కలేదు. ఈసారి వీళ్ళ ఇద్దరి కలయికలో సినిమా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమా చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ సినిమా , వెంకటేష్ నారప్ప సినిమా పూర్తి చేసాక పూరి ,వెంకటేష్ సినిమా ఉండబోతోంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
