ఇకపై ఫ్రీగా మీ డాటాని బ్యాక్అప్ చేయనున్న గూగుల్ వన్
1 min read
Image Source: Google
గూగుల్ వన్ లో ఇకపై ఫ్రీగా మీ డాటా బ్యాక్అప్
గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ గూగుల్ వన్, మీ ఐఓస్, ఆండ్రాయిడ్ ఫోన్లలోని డేటా ని ఉచితంగా బ్యాక్అప్ చేయనుంది. గూగుల్ ఈ సర్వీసును 2018 లో ప్రారంభించింది. ఇప్పటివరకూ ఈ సౌకర్యం సబ్‌స్క్రిప్షన్ మెంబర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని గూగుల్ ఖాతాతో ఉచితంగా బ్యాక్అప్ చేస్తుంది.
ఫోటోలు ,వీడియోలు ఇతర డేటాని బ్యాక్అప్ చేస్తుంది. బ్యాక్అప్ ఫీచర్ తో పాటు మొబైల్ లో స్టోర్ అయిన ఫైల్స్ ఈజీగా యాక్సెస్ చేసుకునేలా గూగుల్ వన్ అందుబాటులోకి రానుంది. ఈ స్టోరేజ్ సౌకర్యం మొబైల్స్ తో పాటు వెబ్ ఫ్లాట్‌ఫాంలకు కూడా అందుబాటులో ఉండనుంది.
