May 12, 2025

Digital Mixture

Information Portal

సంబరాల సంక్రాంతి- Happy Pongal-2021

1 min read
 సంబరాల సంక్రాంతి, Happy Pongal-2021,

Happy Sankranti

భోగభాగ్యాల భోగి … పాడి పంటల క్రాంతి…

మన భారత దేశంలో  ఏ పండుగైనా ఋతువులను ఆధారంగా చేసుకొని, జీవన విధానము, ఆర్థిక, ఆరోగ్య విషయాలనుబట్టి మన పురాణాలు, ఋషులు మన పండుగలను నిర్ణయించడం జరిగింది.

ముఖ్యంగా మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశానికి  ఆయువు పట్టు వ్యవసాయం అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అందుకే పోతన గారు  హాలికులు లేనిది పాలకులు లేరు అని అన్నారు. అంటే రైతు పంట పండించకుంటే, రాజు, బంటు ఇలా రాజ్యంలోని ప్రజలు ఆకలితో అలమటిస్తారు.  ఈ కలియుగంలో జీవులు అన్నదాత ప్రాణులు. తుకారాం లాంటి భక్తులు “ శ్రామికులలో శ్యామ సుందరున్ని చూడమన్నారు.

ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే పర్వదినం మకర సంక్రాంతి. దానికి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి మంటల వేడితో చలిని దూరం చేయడం బయటికి కనిపించే అంశం. కష్టాలు తొలిగి భోగ భాగ్యాలు సిద్ధించాలి అనేది అంతర్లీనం. సంక్రాంతి రోజు ఇంటి ముందు, రంగవల్లులు లక్ష్మీ దేవి ఆగమనానికి సంకేతం. సంక్రాంతి పురుషుడికి శుభ  ఆహ్వానం అని చెప్పొచ్చు. ప్రాంతీయ ప్రకారం పిండి వంటలు, బొమ్మల కొలువు గాలి పటాల పండుగ, చిన్నారులకు రేగు పండ్లు పోయించడం, కూతుళ్ళు, అల్లుళ్ళ సంబరాలు, గోదాకళ్యానం ఈ విధంగా గ్రామీణ, నగర భారతం ఆనందంగా పండుగ జరుపుకుంటారు. ఏ పండుగలైనా ప్రజల ఐకమత్యత జాతీయతను కీర్తించే విధంగా ఏర్పరిచినారు. కొత్త పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి రైతులు గోపూజ చేస్తారు.

మనం సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటాము.

భోగి పండుగ :  భోగ భాగ్యాలతో తుల తూగాలని,రాతి ఇంటి ముందు చక్కగ్గా ఆవు పేడతో కలాపి చల్లి, రంగ వల్లులు, ముగ్గులు వేసి గొబ్బెమ్మను పెట్టి ధాన్య లక్ష్మిని ఆహ్వానిస్తారు. భోగి మంటలతో చలిని కాచుకోవడం మనకు సాధారణంగా చేస్తుంటాం. కష్టాలు తీరి భోగ భాగ్యాలు కలగాలని  దీనికి అర్ధం.

ఈ రోజే వైష్ణవ దేవాలయాలలో శ్రీ గోదా రంగనాథుల కల్యాణాన్ని జరుపుతారు. చిన్న పిల్లలకు భోగి పండ్లను పోస్తారు. ఈ పండుగను ప్రాంతాల వారిగా వివిధ పద్దతుల్లో జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో కోళ్ళ పందాలు ఆడటం ఆనవాయితీగా పాటిస్తుంటారు. ఇళ్ళలో బొమ్మల కొలువులను ఏర్పాటు చేసుకుంటారు.

మకర సంక్రాంతి: ఈ రోజు కూతుళ్ళు, అల్లుళ్ళు కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్తారు. ఈ రోజు పిల్లలు, పెద్దలు అందరూ కలిసి గాలి పటాలు ఎగుర వేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను కైట్స్ (పతంగులు) ఫెస్టివల్ అని కూడా అంటారు. వైష్ణవులు ధనుర్మాస వ్రతమును ఆచరిస్తారు. ఈ రోజు హరి దాసులు గంగిరెద్దుని తీసుకొని ఇంటి ఇంటికి తిరగడం జరుగుతుంది. ఈ హరిదాసుకి బియ్యము, పైసలు ఇవ్వడం జరుగుతుంది.

కనుమ పండుగ:  ఈ రోజు వ్యవసాయ దారులకు ముఖ్యమైన రోజు. ఈ రోజు వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. అవ్వులు, ఎద్దులకు చక్కగా స్నానం చేయించి వాటిని అలకరించి, పూల దండలతో అలంకరించి వాటికి పొంగలి వండి పెడతారు.  తమ పొలాలలో ఆ పొన్గలీ చల్లుతారు. ధాన్యము బాగా పండాలని, భుఉమాతను, సూర్య భగవానుని పూజిస్తారు. కొత్త  ధాన్యం ఇంటికి వస్తుంది. మరియు నిత్యం సహకరించే గోమాతను పూజించి పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని భగవంతున్ని ప్రార్ధిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *