ట్విట్టర్‌లో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసిన సల్మాన్ ఖాన్
1 min read
ట్విట్టర్‌లో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, కండల వీరుడు సల్మాన్ ఖాన్. రీలీజ్ అయిన ప్రతీ సినిమాతో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంటాడు. అభిమానులు సల్మాన్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాల్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కొత్త రికార్డుని క్రియేట్ చేసి తన సత్తా చాటుకుంటున్నాడు.
తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్‌గా 40 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన రెండో సినీ సెలెబ్రిటీగా రికార్డుని క్రియేట్ చేసాడు. ఇప్పటి వరకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ 41.49 మిలియన్ల ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో ఉన్నారు. తాజాగా సల్మాన్ 40 మిలియన్ల ఫాలోవర్స్‌తో రెండో స్థానానికి చేరుకున్నాడు.
