May 21, 2024

Digital Mixture

Information Portal

కన్నప్ప లో ప్రభాస్ నటించడం లేదా! Is Prabhas in Kannappa Movie ?

1 min read
Is Prabhas in Kannappa Movie, Akshay Kumar in Kannappa Movie

Is Prabhas in Kannappa Movie

మంచు విష్ణు (Manchu Vishnu) అండ్ ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా కన్నప్ప (Kannappa). 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఒక విషయం చర్చనీయాంశమైంది. మొదటినుండి కన్నప్ప సినిమా లో శివునిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. అందుకుగాను ప్రభాస్ ఫ్యాన్స్ నుండి కూడా మంచి స్పందన వచ్చింది. ప్రభాస్ తదుపరి చిత్రాలలో కన్నప్ప చిత్రం చేరిపోయింది. అలాగే కన్నప్ప సినిమాకి కూడా మంచి బజ్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు.

అయితే ఇంతలోనే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్  కుమార్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అన్నట్టే అక్షయ్ కుమార్ హైదాబాద్ చేరుకున్నాడు. మంచు విష్ణు, మోహన్ బాబు అక్షయ్ కుమార్ కి ఘన స్వాగతం పలికారు. ఆ విడియోని మంచు విష్ణు Instagraam లో పంచుకున్నాడు. దీనితో అక్షయ్ కుమార్ కన్నప్ప సినిమాలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు నిజమని తేలిపోయింది. అయితే ఇక్కడ అందరికి, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి కలిగే సందేహం ఏంటంటే అక్షయ్ కుమార్ చేసే పాత్ర ఏంటి అని. ఇప్పుడున్న ప్రచారం ప్రకారం అక్షయ్ కుమార్ శివుని పాత్ర చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యనే అక్షయ్ కుమార్ OMG 2 సినిమాలో శివుని పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

కన్నప్ప  సినిమాతో అక్షయ్ కుమార్ తెలుగు ఇండస్ట్రీ లో అడుగుబెట్టపోతున్నాడు. గతంలో 1993 లో ఒక కన్నడ సినిమాలో నటించారు. తరువాత 2018 లో వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కలయికలో వచ్చిన రోబో 2.0 లో నటించి తమిళ పరిశ్రమలో అడుగుపెట్టాడు.

Prabhas,Kannappa,Akshay Kumar,Manchu Vishnu,Kannappa Telugu Movie,Kannappa Movie
Akshay Kumar in Kannappa

అయితే మొదట ప్రభాస్ శివుని పాత్ర చేయబోతున్నాడని అటు సోషల్  మీడియా కథనాలు రాసింది. మరి ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటించడం లేదా, ఒకవేళ నటిస్తే ఈ పాత్ర చేయబోతున్నాడని అటు ఫ్యాన్స్ ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రం లో మంచు విష్ణు తో పాటు  అగ్ర కథానాయకులు మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్ నటిస్తుండగా ప్రభాస్ మరియు నాయన తారలు కీలక పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకతం వహిస్తున్నారు. ఈయన స్టార్ ప్లస్ లో మహాభారత సీరిస్ ని తెరకెక్కించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *