బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
1 min read
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) ఈరోజు ఉదయం కన్నుమూశారు. రెండు సంవత్సరాలుగా ఇర్ఫాన్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్)తో బాధ పడుతున్నారు. దీనికోసం లండన్‌లో చికిత్స చేయించుకున్నారు.తరువాత అనారోగ్యం నుండి కోలుకొని ఇండియాకి తిరిగి వచ్చారు. అయితే నిన్న అస్వస్థతకు గురి కావడంతో ముంబై లోని కోకిలాబెన్ హాస్పెటల్‌కి తరలించారు. నిన్నటినుండి మ్రుత్యువుతో పోరాడిన ఇర్ఫాన్ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బబిల్, అయాన్ ఉన్నారు.
దీనితో బాలీవుడ్ ఒక్కాసారిగా షాక్‌కి గురైంది. బాలీవుడ్ ఒక మంచి నటున్ని కోల్పోయిందని ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.
ఈ నెల 25 న ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం (95) రాజస్థాన్ లోని జయపురంలో మ్రుతి చెందారు. లాక్‌డౌన్ కారణంగా ముంబయి లో చిక్కుకుపోయి, తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయారు.
ఆయన తెలుగులో సైనికుడు సినిమాలో మహేష్ బాబుకి విలన్ గా (పప్పు యాదవ్) నటించారు. ఈ వార్త విన్న మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.

Rip