బాలయ్య ఫాన్స్ ఆశ తీరుతుందా !
1 min readబాలయ్య ఫాన్స్ ఆశ తీరుతుందా !
టాలీవుడ్లో ఇప్పుడు అంతా బి ది రియల్ మాన్ ఛాలెంజ్ గురించే చర్చ. ఒకరి నుండి ఒకరికి ఆ ఛాలెంజ్ సాగుతూ ఉంది. ఈ ఛాలెంజ్‌ని అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేసాడు. అలా అలా జూ. ఎన్.టి.ఆర్ దగ్గరికి వచ్చింది. జూ. ఎన్.టి.ఆర్, సీనియర్ హీరోలకు ఛాలెంజ్‌ని విసిరాడు. అందులో బాబాయి బాలయ్యతో పాటు, చిరంజీవి,వెంకటేష్, నాగార్జున, కొరటాల శివ ఉన్నారు. ఇందులో చిరంజీవి, వెంకటేష్, కొరటాల శివ ఛాలెంజ్‌ని స్వీకరించి వీడియోలను కూడా పోస్ట్ చేసారు.
అయితే ఇక్కడే అందరికి ఒక అనుమానం. బాలయ్య బాబు ఈ ఛాలెంజ్‌ని స్వీకరిస్తాడా లేదా. అయన ఫాన్స్‌తో సహా అందరూ ఎదురు చూస్తున్నారు. బాలయ్యకి ఇలాంటివి నచ్చవని, ఛాలెంజ్‌ని స్వీకరించరని కొందరి వాదన. ఇప్పుడు జూ. ఎన్.టి.ఆర్ వేసిన ఛాలెంజ్‌ని స్వీకరించకపోతే వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు వచ్చే పుకార్లు నిజమని నమ్మే అవకాశం ఉండొచ్చు అని కొందరి వాదన.
ఇప్పుడు ఈ టాపిక్ టాలీవుడ్లో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య బాబు వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాడు అని ఎదురు చూస్తున్నారు.
బాలయ్య బాబు మనసులో ఎముందో మరి.

