May 12, 2025

Digital Mixture

Information Portal

విజయ దశమి కథ – Story behind Vijaya Dashami

1 min read
Story behind vijaya Dashami, Story of vijaya Dashami in Telugu,Story of Vijaya Dashami, Vijaya Dashami, విజయ దశమి కథ, Dussehra Festival, Hindu Festivals,

విజయ దశమి కథ

పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.  మహిశం అంటే దున్నపోతు. ఈ రూపంలో ఉండడంవల్ల మహిషాసురుడు అని పిలవడం  జరిగింది. రాక్షసులలో అతి బలవంతుడు ఈ  మహిషాసురుడు. దీనివల్ల అతనికి ఎలాగైనా ముల్లోకాలను జయించాలనే కోరిక. దీనికోసం బ్రహ్మ దేవుని వరం కోసం ఘోరమైన తపస్సుని మొదలు పెట్టాడు. ఇలా కొన్ని ఏళ్ళ పాటు ఘోరమైన తపస్సు చేయసాగాడు. మహిశాసురిని తపస్సుకి మెచ్చి బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఈ ప్రపంచంలోని ఏ పురుషుని చేతిలో నాకు చావు ఉండకూడదు అని మహిషాసురుడు బ్రహ్మ దేవుణ్ణి వరం కోరుకున్నాడు. ఆడవాళ్ళు తనని ఓడించలేరనే నమ్మకంతో ఈ వరాన్ని కోరుకున్నాడు.

వర ప్రసాదుడైన మహిశారుడు ముల్లోకాలపై పడి ప్రజలను పీడించ సాగాడు. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు కూడా ఏమీ చేయలేక పోయారు. దాంతో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించడం జరిగింది. మహిశాసురిడి చావు ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి, మనం అంతకంటే ఎక్కువ శక్తివంతురాలిని సృష్టించాలి అని అనుకున్నారు. అలా వారందరి  అంశల చేత సృస్టించబడినదే దుర్గా దేవి.

18 చేతులతో ఉన్న దుర్గా దేవి సిద్దమైనప్పుడు, యుద్ధానికి సరిపడా ఆయుధాలను దేవతలు అందించారు. విష్ణుమూర్తి విష్ణు చక్రాన్ని, మహేశావరుడు త్రిశూలాన్ని, మహేంద్రుడు వజ్రాయుదాన్ని అందించారు. ఇలా అన్ని ఆయుధాలను ధరించిన దుర్గా దేవి, సింహాన్ని వాహనంగా చేసుకొని మహిషాసురుని మీదకు యుధ్ధానికి బయల్దేరింది. మహిషాసురుడు కూడా దుర్గా మాతను ఎదుర్కోవడానికి లక్షల సైన్యం తో వచ్చాడు. దుర్గా దేవి తన ఆయుదాలతో మరియు వాహన మైన సింహం ఆ లక్షల సైన్యాన్ని నాశనం చేసేసాయి. అలా తొమ్మిది రోజులు భీకరంగా యుద్ధం కొనసాగిన  తరువాత దుర్గాదేవి మహిశాసురున్ని వధించడం జరిగింది. మహిశారుడు మరణించడంతో దేవతలు పండుగ జరుపుకున్నారు. ఇలా పండుగ చేసుకోవడమే విజయ దశమి కి నాంది అని చెప్పొచ్చు. ఇలా 9 రోజులు జరగడంతో దానికి చిహ్నంగా మనం నవ రాత్రులను జరుపుకుంటాం. తరువాత రోజును దసర లేదా విజయ దశమి గా జరుపుకుంటాం.

ఈ విజయ దశమిని భారత దేశం ఘనంగా జరుపుకుంటుంది. వారి వారి  ప్రాంతాలకు అనుగుణంగా ఈ పండుగను జరుపుకుంటారు. పచ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమ్మవారి విగ్రహాలను అలకరించి ఘనంగా పండుగ జరుపుకుంటారు.  తెలంగాణాలో దసర పండుగతో పాడు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆచారం. అలాగే ఉత్తరాదిన రాముడు రావణున్ని చంపింది కూడా ఈ రోజే అని నమ్ముతారు. అందుకని దానికి చిహ్నంగా రామ్ లీల పేరుతో నాటకాలు ప్రదర్శిస్తారు.

చెడుపై మంచి గెలిచింది  అనే దానికి నిదర్శనంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఒక మనిషికి ఎన్ని సుగుణాలు ఉన్నా ఒక దుర్గుణం అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది అనడానికి ఈ విజయ దశమి కథని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *