RBI New Rule: ఇక ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు మొత్తం కార్డు వివరాలు తప్పనిసరి…
1 min read
RBI New rule for online transactions
ఈ మధ్య కాలం లో అందరూ ఆన్లైన్ లోనే ట్రాన్సాక్షన్ ఎక్కువగా చేస్తున్నారు. అయితే రెగ్యులర్ గా ఇలా చేసేవారు వారి డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను ప్రతీసారి ఎంటర్ చేయాల్సిన పని లేకుండా, ఆయా కార్డు వివరాలను గుర్తుపెట్టుకునేలా తరుచూ ఉపయోగించే వెబ్సైట్లలో సేవ్ చేసి పెట్టుకుంటారు. కొత్త ట్రాన్సాక్షన్ చేసే ముందు CVV మాత్రమే ఎంటర్ చేసి ఆ ట్రాన్సాక్షన్ పూర్తి చేసుకుంటున్నారు.
కానీ ఇప్పుడు RBI కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అదేంటంటే ఇకపై ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే ప్రతీసారి తప్పనిసరిగా మీ కార్డు వివరాలని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ కార్డు 16 అంకెల నంబర్, మీ పేరు, ఎక్స్పైరీ డేటు, CVV వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
అమెజాన్, ఫ్లిప్ కార్ట్, గూగుల్ పే, పేటియం లాంటి ఆన్లైన్ ఫ్లాట్ ఫాం లో యూజర్ల డేటాని స్టోర్ చేయకూడదన్న ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనను RBI తీసుకొచ్చింది. కార్డు వివరాలను వెబ్సైట్లలో సేవ్ చేసి ఉంచడం తో ఆన్లైన్ మోసాలకు మార్గం సులభమవుతోందని RBI ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
జనవరి 2022 నుండి ఈ కొత్త నిబంధన అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్సైట్స్ యూజర్ల డేటాని సేవ్ చేసుకొని అవసరమైనప్పుడు వారికి అందిస్తున్నాయి. ప్రస్తుతం CVV నంబరు, OTP ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ పూర్తి చేసుకుంటున్నారు.
