కొత్త జట్టు తో IPL లోకి అడుగుపెట్టబోతున్న మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్…
1 min read
Ram Charan Enter In to IPL
తండ్రికి తగ్గ తనయుడిగా తనకంటూ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు రామ్ చరణ్. తను సినిమాల్లో హీరోగా నటిస్తూ, ఒక నిర్మాతగా, ఒక బిజినెస్ మ్యాన్ గా ప్రత్యేకతను చాటుకున్నాడు. నిర్మాతగా తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసారు. అలాగే విమాయాన రంగంలో ట్రూ జెట్ పేరుతో విమాన సర్వీసులను అందిస్తున్నాడు.
ఇప్పటికీ ఇండియా లో బాగా పాపులర్ అయిన ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్. అందులోనూ IPL T20 కి క్రేజ్ చాలా ఎక్కువ. ఈ IPL ద్వారా భారిగా లాభాలను పొందే అవకాశం ఉండటంతో, IPL లో బడా వ్యాపార సంస్థలు, బడా హీరోలు పెట్టుబటిపెట్టి లాభాలను గడిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ IPL లోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వలనుకుంటన్నాడాట. దానికోసం వైజాగ్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దానికి వైజాగ్ వారియర్స్ పేరును పరిశీలనలో ఉంచినట్టు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం నుండి IPL T20 లో రామ్ చరణ్ వైజాగ్ టీమ్ ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయట. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నుండి రెండు జట్లు IPL లో ఆడనున్నాయి. దీనితో మరికొంత మంది యువ క్రికెటర్లకు, అవకాశాలకోసం ఎదురుచూసే వారికి ఈ కొత్త జట్టు ద్వారా అవకాశాలను పొందవచ్చు.
