Tata IPL T20-పోరాడి ఓడిన రాజస్థాన్ రాయల్స్
1 min read
Rajsthan Vs Punjab
పంజాబ్ (PBKS), రాజస్థాన్ (RR) మధ్య జరిగిన ఐపిఎల్ (IPL) 8 వ మ్యాచ్ లో పంజాబ్ 5 పరుగుల తేడాతో గెలిచింది. 198 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన రాజస్తాన్ పవర్ ప్లే లోపే 57 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. కానీ సంజు సామ్సన్ మంచి ఫామ్ లో ఉన్నట్టు అనిపించింది. ఫోర్లు, సికర్లతో స్కోర్ ని కొంచెం పరిగెత్తించాడు. అప్పటివరకు మంచి ఊపు మీద ఉన్న రాజస్తాన్ కి సంజు సామ్సన్ అవుటవడంతో ఒక్కసారి ఆట పంజాబ్ చేతికి వెళ్ళింది. సంజు సామ్సన్ 42 పరుగులకు పెవిలియన్ దారి పట్టాడు. ఆ తరువాత వచ్చిన దేవదత్ వడిక్కల్, రియాన్ పరాగ్ కొంత వరకు ఫోర్లు, సిక్సర్లతో అలరించినా రన్ రేట్ ని మాత్రం తగ్గించలేక పోయారు. పరాగ్, వడిక్కల్ ఒకరి తరువాత మరొకరు అవుటవ్వడంతో పంజాబ్ విజయం ఖాయమని అంతా భావించారు.
అప్పుడు క్రీజ్ లోకి ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వచ్చిన ద్రువ్ జురెల్ మరియు హెట్మయిర్ మొత్తం ఆట స్వరూపాన్నే మార్చేసారు. రాజస్తాన్ టీమ్ తో పాటు అభిమానుల్లో గెలుస్తాం అన్న ఆశ కల్పించారు. ఒక దశలో 23 బంతులకు 63 పరుగుల నుండి 6 బంతుల్లో 15 పరుగుల వరకు మ్యాచ్ ని రసవత్తరంగా ముందుకు తీసుకొచ్చారు. కానీ చివరి ఓవర్లో హెట్మయిర్ రన్ అవుట్ అవడంతో పాటు సామ్ కరాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో 15 పరుగులకు 10 పరుగులే చేయడంతో 5 పరుగుల తేడాతో పంజాబ్ విజయాన్ని అందుకుంది. పంజాబ్ బౌలింగ్ లో నాతన్ ఎల్లిస్ 4, అర్శదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లో 197 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ ముందు ఉంచింది. పంజాబ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ 60 పరుగులతో, శిఖర్ ధావన్ 86 పరుగులు చేయడంతో పంజాబ్ 20 ఓవర్లలో 197 పరుగులకు 4 వికెట్లను కోల్పోయింది. మిగతా ఆటగాళ్ళు అంతగా ఆడకపోవడంతో 210 పరుగులకి పైన స్కోర్ చేస్తారనుకున్న అంచనా తప్పింది.
