చరిత్రలో ఇదే మొదటి సారి… పురుషుల క్రికెట్ లో మహిళ ఫీల్డ్ అంపైర్ …
1 min read
Kim Cotton Makes History
సాధారణంగా అంతర్జాతీయ పురుషుల క్రికెట్ మ్యాచ్ లలో ఫీల్డ్ అపైర్లుగా పురుషులను మాత్రమె చూసాము. కానీ ఇప్పుడు ట్రెండ్ ని మారుస్తూ ఒక మహిళా అపైర్ పురుషుల క్రికెట్ మ్యాచ్ లో ఫీల్డ్ అపైర్ గా విధులను నిర్వహించింది. చరిత్రలో తొలిసారి పురుషుల క్రికెట్ మ్యాచ్ లో మహిళా ఫీల్డ్ అంపైర్ గా విధులు నిర్వహించి న్యూజిలాండ్ కి చెందిన కిమ్ కాటన్ (Kim Cotton) ఈ ఘనతను సాధించింది.
న్యూజిలాండ్, శ్రీలంక మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో కిమ్ కాటన్ అంపైరింగ్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు థర్డ్ అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఫీల్డ్ అపైర్ గా మాత్రం ఇదే మొదటిసారి.
ఇక న్యూజిలాండ్, శ్రీలంక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ 9 వికెట్లతో విజయాన్ని సాధించి సీరిస్ ని 1-1 సమ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది. ధనంజయ డిసిల్వ, కుసాల్ పెరేరా 37, 35 పరుగులు, మిగతా ఆటగాళ్ళు ఎవరు సరిగా రాణించకపోవడంతో శ్రీలంక 141 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే 5 వికెట్లు పడగొట్టాడు.
చేధనలో దిగిన న్యూజిలాండ్ 14.4 ఓవర్లో 146 పరుగులకు 1 వికెట్ కోల్పోయి 9 వికెట్లతో విజయం సాధించింది. Tim Seifert 43 బంతుల్లో 79 పరుగులతో నాటౌట్ గా నిలిచి న్యూజిలాండ్ కి విజయాన్ని అందించాడు.
