Fastest 100s in Cricket World Cup history
1 min read
List of fastest 100s in ICC ODI Cricket World Cup history
ICC world cup 2023 లో రికార్డు, 40 బంతుల్లో సెంచరి
40 బంతుల్లోనే సెంచరి సాధించిన ఆస్ట్రేలియా క్రికెటర్ Glenn Maxwell.
ఈ రోజు ICC world cup 2023 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా (Australia), నెదర్లాండ్స్ (Netherlands) తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 399 పరుగులు చేసింది. అయితే ఆస్ట్రేలియా పసికూనలైన నెదర్లాండ్స్ పై మొదటి బంతి నుండి విరుచుకుపడిందని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయడానికి మొదటినుండి దూకుడుని ప్రదర్శించింది.
డేవిడ్ వార్నర్ సెంచరీ తో చెలరేగిపోయాడు. 93 బంతుల్లో 104 పరుగులు చేసాడు. అయితే అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన Glenn Maxwell, నెదర్లాండ్స్ బౌలర్లకి చుక్కలు చూపించాడని చెప్పొచ్చు. ప్రతీ బంతి ని బౌండరీకి తరలించే ప్రయత్నం చేసాడు. స్టేడియం లో అన్ని వైపులా ఫోర్స్, సిక్సర్లు బాదాడు.
అలా బాదటంతో, 40 బంతుల్లోనే సెంచరి పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేసాడు. 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 44 బంతుల్లో 106 పరుగులు చేసాడు. దీనితో ఆస్ట్రేలియా స్కోరు 8 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది.
40 బంతుల్లో సెంచరి చేసి Glenn Maxwell ICC ODI Cricket World Cup history లో తక్కువ బంతుల్లో సెంచరి చేసిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
| Player | Vs. | Total Runs | Balls | Year |
| Glenn Maxwell | Netherlands | 106 | 40 | 2023 |
| Aiden Markram | Sri Lanka | 106 | 49 | 2023 |
| Kevin O’Brien | England | 113 | 50 | 2011 |
| Glenn Maxwell | Sri Lanka | 102 | 51 | 2015 |
| AB de Villiers | West Indies | 162 | 52 | 2015 |
