Direct Flights from Hyderabad to Maldives… GMR Hyderabad International Airport Ltd. (GHIAL) Announced.
1 min read
Rajiv Gandhi International Airport Image: Google.
Direct Flights from Hyderabad to Maldives… హైదరాబాద్ నుండి మాల్దీవ్స్ వెళ్లాలనుకునేవారికి శుభవార్త. హైదరాబాద్ నుండి మాల్దీవ్స్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం అయ్యాయి,
ఇండిగో విమాన సంస్థ తక్కువ ధరలో ఇండియాలో వివిధ ముఖ్య పట్టణాలకు, వివిధ దేశాలకు ప్రయాణం చేసే సేవలను అందిస్తోంది. అందుకే ఇండియాలో విమాన రంగంలో అధిక వాటాతో మొదటి స్థానంలో అగ్రగామిగా ఉంది.
అందులో భాగంగా ఇండిగో హైదరాబాద్ నుండి మాల్దీవ్స్ కి డైరక్ట్ ఫ్లైట్ ని ఆరంభించింది. సెలవుల్లో మాల్దీవ్స్ కి వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సదుపాయం అని చెప్పొచ్చు.

ఈ ఫ్లైట్ నిన్నటినుండి (Oct 31st) ప్రారంభం అయింది. ఇండిగో (Indigo) 6E-1797 హైదరాబాద్ నుండి 12:40 గంటలకు బయల్దేరి 14:50 గంటలకు Male Airport కి చేరుకుంటుంది. 2 గంటల 10 ని.లలో మాల్దీవ్స్ కి చేరుకుంటాము.
తిరిగి ఇండిగో (Indigo) 6E-1798 మాల్దీవ్స్ నుండి 15:55 గంటలకు బయల్దేరి 18:45 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ చేరుకోవడానికి 3 గ. 30ని.ల సమయం పడుతుంది.
Hyderabad నుండి Maldives కి వెళ్ళడానికి ఫ్లైట్స్ ప్రతి మంగళ, గురు మరియు శనివారాల్లో అందుబాటులో ఉంటాయి.
