“బలగం” మొగులయ్యకి “ చిరు” భరోసా…
1 min read
Chiru Promises To Balagam Mogulayya
తనను ఈ స్థానం లో ఉంచిన తన అభిమానులకు, సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ తపించే వారిలో ముందుండే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). స్వశక్తి తో ఎన్నో సాధక బాధకాలను ఓర్చి పైకి ఎదిగిన వ్యక్తిగా, సినీ రంగానికి చెందిన నటీ నటులకు కానీ, కార్మికులకు కానీ చాలా రకాలుగా ఏదో ఒక రూపేణ సాయం చేస్తూనే ఉన్నాడు. మనకు తెలిసి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ సిలండర్స్ ద్వారా ఎంతో మందికి సాయం చేసారు. అలా మంకు తెలియనివి చాలానే ఉంటాయని అనుకోవచ్చు. అది సాయం పొందిన వారి ద్వారానే బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది.
అయితే కొద్ది రోజులుగా మన చూస్తున్నట్టు బలగం మొగులయ్య (Balagam Mogulayya)కి తీవ్రంగా ఆరోగ్యం క్షీణించింది. రెండు కిడ్నీలు పాదవటంతో, కంటి చూపు కూడా పోయింది. షుగర్, బీపి ఇతరత్రా సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందించారు. బలగం డైరెక్టర్ వేణు (Balagam Venu) కి ఫోన్ చేసి, మొగులయ్య కి కంటి చూపు తెప్పించే భాద్యత నాది, ఎంత ఖర్చైనా తనే భారిస్తానన్నట్టు మెగాస్టార్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయం వేణు మొగులయ్యకి చెప్పడం జరిగింది. మొగులయ్య తన వారి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.
