May 21, 2024

Digital Mixture

Information Portal

బుట్టబొమ్మ వచ్చేసింది -“అల వైకుంఠపురంలో” నుండి మరో పాట

1 min read

బుట్టబొమ్మ వచ్చేసింది.  

“అల వైకుంఠపురంలో” నుండి  మరో పాట.

స్టైల్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్  శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న అల వైకుంఠపురంలో నుండి ఇంకొక పాట విడుదలైంది. అదే  బుట్టబొమ్మ  పాట. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఈ సాంగ్ టీజర్ ఈ పాటపై అంచనాలను పెంచింది. 

టీజర్‌పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే ఈ బుట్టబొమ్మ పాట పూర్తిగా ఆకట్టూకునేదిగా ఉంది.

ఈ పాటకు  థమన్ సంగీతం అన్న సంగతి తెలిసిందే. ఈ పాటకు  రామ జోగయ్య శాస్రి సాహిత్యం అందించగా, దాని మాధుర్యం పాడవకుండా అర్మాన్ మాలిక్ దీన్ని పాడి మెప్పించారు.

కొత్తరకమైన, సరదా సాహిత్యంతో రామజోగయ్య శాస్రి మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు.  

హీరో తన లవ్‌ని తనకు తోచిన వాటితో పోలుస్తూ పాడుకునే పాట ఇదని చెప్పొచు. 

“ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము,” 

“బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టూకుంటివే  జిందగీకే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే” 

“మాటగా ఓ మల్లె పువ్వునడిగితే మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే” 

ఇలా కొత్తగా తన సాహిత్యంతో రామజొగయ్య శాస్రి అందరినీ ఆకట్టుకున్నారు.  

తన గాత్రంతో  అర్మాన్ మాలిక్ కూడా పాటకు ప్రాణం పోసారు.

2 thoughts on “బుట్టబొమ్మ వచ్చేసింది -“అల వైకుంఠపురంలో” నుండి మరో పాట

  1. Really very happy to say that your post is very interesting. I never stop myself to say something about it. You did a great job. Keep it up.We have an excellent information in cinema industry. We are showing updated news that are very trendy in the film industry. For further information, please once go through our site.
    Tollywood Gossips in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *