బాలీవుడ్ అగ్ర నటుడు రిషీకపూర్ కన్నుమూత
1 min read
బాలీవుడ్ అగ్ర నటుడు రిషీకపూర్ కన్నుమూత
బాలీవుడ్ అగ్ర నటుడు, రిషీకపూర్ ఇవాళ ఉదయం కన్ను మూశారు.
నిన్న రాత్రి శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగానే ఇవాళ ఉదయం మృతి చెందారు.
1952 సెప్టెంబర్ 4 వ తేదీన ముంబయిలో రిషి కపూర్ జన్మించారు. బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ రెండో కుమారుడు రిషీకపూర్. 1980లో హీరోయిన్ నీతూ సింగ్‌ని పెళ్ళాడారు. రిషికపూర్ కుమారుడు ప్రముఖ బాలీవుడ్ హీరోలలో ఒకరయిన రణబీర్ కపూర్.
2018లో రిషీకపూర్‌కి క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది. దీనికోసం అమెరికాలో చికిత్స చేయించుకున్నారు.
రిషీకపూర్ మరణం ఇండియన్ సినిమా అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.
