జియోలో పెట్టుబడులు పెట్టిన మరో అమెరికా సంస్థ.
1 min readజియోలో పెట్టుబడులు పెట్టిన మరో అమెరికా సంస్థ.
గత కొన్ని రోజులుగా రిల్లయన్స్ జియో కొత్త పెట్టుడలను ఆహ్వానిస్తూ తన వ్యాపార సామ్ర్యాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళుతోంది.
అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ జియోలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్ రూ. 43,574 కోట్లతో 9.9 శాతం కొనుగోలుకు ఏప్రియల్ 25న జియోతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ తర్వాత మే 4 న అమెరికా ఈక్విటీ సంస్థ అయిన సిల్వర్ కేక్ జియోలో రూ. 5656 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది.
ఇప్పుడూ మరొక అమెరికా సంస్థ అయిన “విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్” జియో ఫ్లాట్ ఫాంస్ లో రూ.11,367 కోట్ల పెట్టుబడి పెడుతున్నాట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఈ కొనుగోలుతో 2.32 శాతం వాతాను విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ సొంతం అవుతుంది.
ఈ ఒప్పందాల ద్వారా జియో పెట్టుబడుల రూపంలో రూ. 60,596.37 కోట్లను సేకరించింది.

