మన రాజుకి రాణి దొరికింది…. ప్రభాస్ సరసన దీపికా…
1 min read
Source: Twitter / Google
ప్రభాస్ 21 వ చిత్రంలో హిరోయిన్ గా దీపికా పదుకొనె…
ప్రకటించిన వైజయంతి మూవీస్….
ఎన్నో రోజులనుండి వస్తున్న రుమార్లకు తెర పడింది. ప్రభాస్ 21 వ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికోసం దానికి తగ్గ స్టార్ కాస్ట్ ని ప్లాన్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా హీరోయిన్ సెలెక్షన్ పై చాలా ప్రచారాలు జరిగాయి. మొదట దీపికా పదుకొనె అన్నారు, తర్వాత కత్రినా కైఫ్, ఆలియా భట్ పేర్లు కూడా బయటకి వచ్చాయి. ఎందుకంటే హై బడ్జెట్ తో తీయబోయే ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ తో పాటు మరికొన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేసే అవకాశం ఉంది. అందుకోసం హీరోయిన్ కూడా అదే రేంజ్ కి తగ్గట్టు ఉండేలా చూసుకున్నారు నిర్మాత. వైజయంతి బ్యానర్ స్థాపించి 2022 సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా కూడా 2022 లో విడుదల అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాత అశ్వినీ దత్, ప్రభాస్ 21 వ చిత్రం లో దీపికా పదుకొనె నటించబోతున్నట్టు అఫీషియల్ గా యూట్యూబ్లో చిన్న వీడియో ద్వారా ప్రకటించారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రభాస్ చేయబోయే 21 వ చిత్రానికి ప్రభాస్ సరసన్ బాలీవుడ్ టాప్ హిరోయిన్ దీపికా పదుకోనే నటించబోతున్నట్లు కన్ఫర్మ్ చేసారు.
ప్రస్తుతం ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్లో, రాధాక్రిష్ణ దర్శకత్వంలో రాధే శ్యాం సినిమా చేస్తున్నారు. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ప్రభాస్ సరసన దీపికా నటించబోతున్న విషయం తెలియగానే ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవని చెప్పొచ్చు. దీనితో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. నిర్మాత అశ్వినీ దత్ దీపికాకి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి ఈ సినిమా కి ఒప్పించారని సమాచారం. ప్రభాస్, దీపికా స్టార్డం ఈ సినిమా బిజినెస్ పై ఎలాంటి ప్రభావం చూపెడుతుందో, ఎన్ని కొత్త రికార్డులను సృష్టిస్తుందో అని సినీ పండితులు ఎదురు చూస్తున్నారు.
