తన అభిమాన హీరోని పెళ్ళికి ఆహ్వానించిన నితిన్
1 min read
Image Courtesy: Nithin/Instagram
యంగ్ హీరో నితిన్ పెళ్లి ఈ నెల 26 వ తేదిన జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి మాత్రం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతోంది. చాలా తక్కువ మందితో ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య నితిన్ పెళ్లి జరగబోతోంది.
అయితే ఈ పెళ్ళికి తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించాడు. చిన్నప్పటినుండి నితిన్ పవర్ స్టార్ అభిమాని. తన సినిమా ఫంక్షన్లలో కానీ, సినిమాలో కానీ ఎదో రకంగా నితిన్ పవన్ పై తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు.

మొదటి నుండి నితిన్ తన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నా, కరోనా వల్ల సాదా సీదా గా చేసుకోవాల్సి వస్తోంది. అయినా కాని పవర్ స్టార్ ని తన పెళ్ళికి ఆహ్వానించడం జరిగింది.
అలాగే నితిన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించడం విశేషం.
తెలుగు ఇండస్ట్రీ నుండి వరుణ్ తేజ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు ఆహ్వానం అందినట్టు సమాచారం.
