ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ… దర్శకుడిగా తానాజీ ఫేం Om Raut ?
1 min read
ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ… దర్శకుడిగా తానాజీ ఫేం Om Raut ?
ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు హృతిక్ రోషన్….
బాహుబలి సిరిస్ ల తరువాత ప్రభాస్ స్టార్డం ఒక్కసారే మారిపోయిందని చెప్పొచ్చు. టాలీవుడ్ డార్లింగ్ ఇప్పుడు ఇండియన్ సినిమా టాలీవుడ్ టు బాలీవుడ్ అందరికీ డార్లింగ్ అయ్యాడు. చాలామంది బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఉత్సాహ పడుతున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ కి కరణ్ జోహార్ తో మంచి పరిచయం ఏర్పడిందనే చెప్పొచ్చు. అప్పట్లో కరణ్ జోహార్ నిర్మాతగా ఒక సినిమా రాబోతోందని ప్రకటన వచ్చింది, కానీ ఆ సినిమా ఎందుకనో పట్టాలెక్కలేదు.తరువాత ప్రభాస్ సాహో సినిమాతో బాలీవుడ్ ని మరోసారి పలకరించాడు. ఈ సినిమా బాలీవుడ్ కోసమే అన్నట్టు తీసారు. అందుకే తెలుగులో అంతగా ఆకట్టుకొని ఈ సినిమా హిందీలో లాభాల బాట పట్టింది. ప్రభాస్ ఫిజిక్, స్టైల్ కి అక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు.
ఇవన్ని దృష్టిలో ఉంచుకొని బాలీవడ్ దర్శకులు ప్రభాస్ కోసం కథలు సిద్ధం చేస్తూనే ఉన్నారు. అందులో బాగంగా అజయ్ దేవగన్ నటించిన తానాజీ సినిమా దర్శకుడు Om Raut, ప్రభాస్ తో సినిమా చేయడానికి కథ సిద్ధం చేసాడట. అది ప్రభాస్ కి కూడా వినిపించాడట. స్టోరీ లైన్ ప్రభాస్ కి నచ్చడంతో, పూర్తి స్థాయి స్క్రిప్ట్ తయ్యారు చేసే పనిలో ఆ దర్శకుడు ఉన్నాడట. అయితే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు హృతిక్ రోషన్ కూడా నటించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాని కూడా తన ఫ్రెండ్స్ అయిన యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోందట. ఇంకా ఈ విషయాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రభాస్, జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హిరోయిన్ గా నటిస్తోంది. తరువాత మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో,అశ్వినీ దత్ నిర్మించబోయే సినిమాలో నటించబోతున్నాడు.
ఈ సినిమాల తరువాత బాలీవుడ్ సినిమా అవకాశం ఉంది.
